వాల్తేర్‌ లోకోకు రెండో స్థానం | - | Sakshi
Sakshi News home page

వాల్తేర్‌ లోకోకు రెండో స్థానం

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

వాల్తేర్‌ లోకోకు రెండో స్థానం

వాల్తేర్‌ లోకోకు రెండో స్థానం

తాటిచెట్లపాలెం: ఇటీవల బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ లో నిర్వహించిన ‘బ్యూటీ కాంటెస్ట్‌ ఫర్‌ ఎలక్ట్రికల్‌ లోకోమోటివ్స్‌’ పోటీలలో విశాఖ ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌కు ద్వితీయ స్థానం లభించింది. వాల్తేరు డివిజన్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోరా నేతృత్వంలో సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ బి. షణ్ముఖరావు పర్యవేక్షణలో విశాఖపట్నం ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌ సిబ్బంది ఈ విజయాన్ని సాధించారు. వారు డబ్ల్యూ ఏపీ –7 లోకోమోటివ్‌ 37419 ను ఆధునీకరించి, అనేక అధునాతన సౌకర్యాలతో, మార్పులతో ఈ పోటీలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జోనల్‌ రైల్వేల నుంచి మొత్తం 13 లోకోలు ఈ పోటీలలో పాల్గొనగా, విశాఖపట్నం ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌ ఆధునికీకరించిన లోకోకు రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోరా ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌ సిబ్బంది, అధికారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement