31 పిల్లలతో నాగుపాము హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

31 పిల్లలతో నాగుపాము హల్‌చల్‌

Jun 8 2025 12:50 AM | Updated on Jun 8 2025 12:50 AM

31 పి

31 పిల్లలతో నాగుపాము హల్‌చల్‌

ముంచంగిపుట్టు: జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో గొల్లోరి మెద్దు నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది గోతులు తవ్వుతుండగా పెద్దబండరాయి అడ్డుగా ఉంది. దీంతో కూలీలు బండరాయిని తొలగించేందుకు ప్రయత్నం చేయగా నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పామును హతమార్చి, రాయిని తొలగించగా నాగుపాము పిల్లలు గుంపులుగా బయటకు వచ్చాయి. పాము పిల్లలను కొట్టి చంపేసి లెక్క వేయగా 31 పాము పిల్లలుగా తేలింది. గ్రామస్తులు పాములను నిప్పుపెట్టి దహనం చేశారు. ఒకేసారి ఇన్ని పాములు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆసక్తిగా తిలకించారు.

వ్యాన్‌ బోల్తా

రంపచోడవరం: మారేడుమిల్లి మండలం దేవరపల్లి సమీపంలో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్‌ బోల్తా పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

31 పిల్లలతో నాగుపాము హల్‌చల్‌
1
1/1

31 పిల్లలతో నాగుపాము హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement