ఏయూలో సమూల మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఏయూలో సమూల మార్పులు

Jun 7 2025 1:30 AM | Updated on Jun 7 2025 1:30 AM

ఏయూలో సమూల మార్పులు

ఏయూలో సమూల మార్పులు

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్‌లు, డైరెక్టర్‌లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

కీలక నియామకాలు

డీన్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌, డీన్‌ అవుట్‌రీచ్‌, డీన్‌ అలమ్నీ రిలేషన్స్‌, డీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, చీఫ్‌ కో–ఆర్డినేటర్‌లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ విభాగానికి చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ను నియమించారు. డీన్‌ అలమ్నీ రిలేషన్స్‌ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ – సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఓపెన్‌ లెర్నింగ్‌లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు.

నూతన డీన్‌ల వివరాలు

డీన్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌: కె. రాంబాబు, డీన్‌ అకడమిక్స్‌ అఫైర్‌ కె. శ్రీనివాసరావు, డీన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెసర్‌ వల్లికుమారి (కంప్యూటర్‌ సైన్స్‌), డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ – సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఓపెన్‌ లెర్నింగ్‌ ప్రొఫెసర్‌ అప్పలనాయుడు (కెమికల్‌ ఇంజనీరింగ్‌), డీన్‌, పీజీ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్‌), డీన్‌ అలమ్నీ రిలేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్యామల (కెమిస్ట్రీ), డీన్‌ అవుట్‌రీచ్‌ ప్రొఫెసర్‌ కె. రమాసుధ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌), డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ ఎస్‌. హరినాథ్‌ (సోషల్‌ వర్క్‌), డీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లానింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ కె.ఎస్‌. రావు (సివిల్‌ ఇంజనీరింగ్‌), చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేటీ బలరాం పడాల్‌ను నియమించారు.

విభాగాలకు నూతన డీన్‌, డైరెక్టర్ల

నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement