
ట్రాఫిక్ నియంత్రణకుప్రత్యేక చర్యలు
చింతపల్లి: మండల కేంద్రంలోని వారపు సంతలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి బుధవారం జరిగే వారపు సంతకు చింతపల్లి జీకే వీధి మండలాల నుంచి వందలాది మంది గిరిజనులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలతో స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి డిగ్రీ కళాశాల వరకూ తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న దుకాణాలను సంత స్థలంలోకి పోలీసులు దగ్గరుండి మార్పించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకటరమణ మాట్లాడుతూ వారపు సంత రోజున మార్కెట్ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు రాకపోకలు సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.