
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
గంగవరం : పిడుగుపాటుకు అడ్డతీగల గ్రామానికి చెందిన సీహెచ్.సాయి(28) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం గోకవరం నుంచి అడ్డతీగల వైపు బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. భారీ వర్షం కురుస్తుండడంతో గంగవరం– పెదగార్లపాడు మధ్యలో గల జువ్వమ్మ కాలువ వద్ద చెట్టు కింద నిలబడగా పిడుగుపాటుకు గురైన యువకుడి దుస్తులు, కాళ్లు బూట్లు కాలిపోయి సృహ కోల్పుపోయి పడి ఉన్న ఆ యువకుడిని అటుగా వెళ్తున్న వారు గమనించి 108కి సమాచారం అందించి, స్థానిక పీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.