
అనునిత్యం అప్రమత్తత తప్పనిసరి
పెదబయలు: ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేవరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన శాంతి భద్రత వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో సదుపాయాలను పరిశీలించారు. అలాగే స్టేషన్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మారుమూల ప్రాంతాల్లో ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఎస్‌ఐ, సీఐలు, సిబ్బందిని ఆయన అభినందించారు.అలాగే జూన్ నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు ఫలితాల వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే దుకాణాల్లో బాటిళ్లల్లో పెట్రోల్ విక్రయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణాను అరికట్టాలని, మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జి.మాడుగుల సీఐ రమేష్, ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎస్పీ తుహిన్ సిన్హా

అనునిత్యం అప్రమత్తత తప్పనిసరి