రెట్టింపు సొమ్మన్నారు.. ముంచేశారు!
ఈ చిత్రంలో ఓ ప్రైవేటు సంస్థ బాండును చూపిస్తున్న మహిళ ఎటపాక మండలం గన్నవరానికి చెందిన తోట మహాలక్ష్మి. రెట్టింపు సొమ్ములు వస్తాయనే ఆశతో 2012లో ఓ ప్రైవేటు సంస్థలో రూ.30 వేలు డిపాజిట్ చేసింది. తనతో పాటు పెద్దకొడుకు వెంకటేశ్వరరావు రూ.70 వేలు, చిన్నకొడుకు శ్రీనివాసరావు రూ.10 వేలు, కూతురు రమణ మరో రూ.10 వేలు డిపాజిట్ చేశారు. 2019లో గడువు ముగిసినా వీరికి రెట్టింపు సొమ్ములు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. దీనిపై తమకు న్యాయం చేయాలని పోలీసులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


