ఆరు మద్యం షాపులపై అనాసక్తి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ఆరు మద్యం షాపుల కు టెండర్‌దారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 40 షాపులుండగా అక్టోబర్ 18వరకు ప్రభుత్వం ద రఖాస్తులు స్వీకరించింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని దరఖాస్తు గడువు 23వరకు పెంచింది. అయినప్పటికీ ఆరు షాపులకు 10కంటే త క్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా పద్ధతిలో 34 షాపులే కేటాయించి ఆరింటికీ రీటెండర్‌కు అవకాశమిచ్చారు. అక్టోబర్ 28నుంచి రీటెండర్‌కు అవకాశమివ్వగా రెండు షాపులకు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చాయి. ఇచ్చోడ స్టేషన్ పరిధిలోని అడిగామకు ఇదివరకు ఆరు దరఖాస్తులు రాగా శుక్రవారం ఒకటి, భీంపూర్‌కు ఇదివరకు ఐదు రాగా, కొత్తగా మరొకటి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలోని తాంసికి ఐదు, తలమడుగుకు ఐదు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలోని సిరికొండకు మూడు, ఉట్నూర్ స్టేషన్ పరిధిలోని లోకారి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం రీటెండర్ దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే, దరఖాస్తులు తక్కువగా ఉన్నప్పటికీ ఈనెల 3న జెడ్పీ సమావేశ మందిరంలో లక్కీడ్రా తీయనున్నట్లు అధికారులు తెలిపారు.


