‘మధ్యాహ్న’ కార్మికుల ధర్నా
కైలాస్‌నగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మ ధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రా ములు మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మి కులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని ఆరోపించారు. కోడిగుడ్లు, రూ.2వేల వేతనం, అల్పాహారం బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు నెలకు రూ.10వేల కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గుర్తింపు కార్డులు, తహసీల్దార్ ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూనిఫాంలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజనానికి గ్రీన్ చానెల్ ద్వారా బి ల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుజాత, లక్ష్మి, యశ్వంత్‌రావు పాల్గొన్నారు.


