‘పటేల్‌’ ఆలోచనలు ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

‘పటేల్‌’ ఆలోచనలు ఆదర్శనీయం

Nov 1 2025 8:10 AM | Updated on Nov 1 2025 8:10 AM

‘పటేల

‘పటేల్‌’ ఆలోచనలు ఆదర్శనీయం

● కలెక్టర్‌ రాజర్షి షా ● జిల్లా కేంద్రంలో ఐక్యతా ర్యాలీ ● ఘనంగా ‘పటేల్‌’ జయంతి

కైలాస్‌నగర్‌: దేశ ఏకీకరణలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చూపిన దూరదృష్టి, ధైర్యం అందరికీ ఆ దర్శమని, ఆయన విలువలు, ఆలోచనలు ప్ర తి ఒక్కరూ ఆచరించాలని కలెక్టర్‌ రాజర్షి షా సూ చించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం, పోషణ మాసం వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జిల్లా పరిష త్‌ సమావేశ మందిరం వరకు చేపట్టిన ఐక్యతా ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్‌వాడీలు, వివిధ శాఖల అధికారులు ఉ త్సాహంగా పాల్గొన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ ప టేల్‌ జయంతి సందర్భంగా జెడ్పీలో ఆయన చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం పోషణ మాసం, ఏక్తా దివస్‌, నషాముక్త్‌ భారత్‌ అంశాలపై అధికారులు, అంగన్‌వాడీ సిబ్బందితో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. పోషణ మాసం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన పలువురు అంగన్‌వాడీలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. పోషకాహార ప్రదర్శనను పరిశీలించారు. స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాల రుచి చూశారు. ‘స్వస్థ భారత్‌–పోషిత భారత్‌’ నినాదంతో రూపొందించిన ఫ్లెక్సీపై సంతకం చేశారు. సెల్ఫీ పాయింట్‌ వద్ద అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ట్రైనీ కలెక్టర్‌ సలో ని చబ్రా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి మిల్క, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీపీవో రమేశ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌ తదితరులున్నారు.

దేశ సమగ్రతకు పోలీస్‌శాఖ కృషి

ఆదిలాబాద్‌: దేశ సమగ్రతకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందని ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌ పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా, అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్‌) బీ సురేందర్రావుతో కలిసి 5కే రన్‌ను ప్రారంభించి విద్యార్థులు, క్రీడాకారులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టేడి యం నుంచి ప్రారంభమైన రన్‌ కలెక్టర్‌ చౌక్‌, ఎన్టీఆర్‌ చౌక్‌, వినాయక చౌక్‌, నేతాజీ చౌక్‌, అంబేడ్కర్‌ చౌక్‌ మీదుగా తిరిగి అదే మార్గంలో స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. దేశ ఐక్యతను కాపాడడానికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంతగానో కృషి చేశారని కొ నియాడారు. అనంతరం పరుగు విజేతలకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. డీఎస్పీలు శ్రీనివా స్‌, జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్‌, డీవైఎస్వో శ్రీనివాస్‌, పట్టణ సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

‘పటేల్‌’ ఆలోచనలు ఆదర్శనీయం1
1/1

‘పటేల్‌’ ఆలోచనలు ఆదర్శనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement