లోగుట్టు కాంట్రాక్టర్లకు ఎరుక! | - | Sakshi
Sakshi News home page

లోగుట్టు కాంట్రాక్టర్లకు ఎరుక!

Nov 1 2025 8:12 AM | Updated on Nov 1 2025 8:12 AM

లోగుట్టు కాంట్రాక్టర్లకు ఎరుక!

లోగుట్టు కాంట్రాక్టర్లకు ఎరుక!

● నాడు సింగిల్‌ టెండర్‌.. నేడు 22.. ● పనుల కేటాయింపులో అక్రమాలు ● అయినవారికి కట్టబెట్టాలనే యత్నం ● మున్సిపాలిటీలో అవినీతి బాగోతం!

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని వి ద్యుత్‌ దీపాల నిర్వహణ రీటెండర్‌కు వచ్చిన అనూ హ్య స్పందన చర్చనీయాంశమైంది. రూ.1.26 కోట్ల పనులకు ఇటీవల టెండర్లు ఆహ్వానించగా ఒకటే దాఖలైంది. కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాల మేరకు రీ టెండర్లను పిలువగా ఏకంగా 22దాఖలు కావడం చ ర్చకు దారి తీసింది. గతంలో తమకు అనుకూలమై న వారికి పనులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో లేనిపోని నిబంధనలు చేర్చారనే ఆరోపణలున్నాయి.

ఇంతలో ఎంత మార్పు..

కలెక్టర్‌ ఆదేశాలతో అప్రమత్తమైన మున్సిపల్‌ అధి కారులు అగమేఘాల మీద రూ.1.05 కోట్ల విలు వైన ఐదు పనులకు ఈ నెల 23న రీటెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆన్‌లైన్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహించగా ఊహించని రీతిలో టెండర్లు దాఖలయ్యాయి. ఇదివరకు సింగిల్‌ టెండర్‌ రాగా, రిజర్వ్‌ డ్‌ కేటగిరీతోపాటు జనరల్‌ పనులకూ కాంట్రాక్టర్లు పోటీ పడుతుండటం బల్దియాకు కలిసిరానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.23.70 లక్షల పనులకు ఏడు టెండర్లు దాఖలు కాగా, రూ.19లక్షలకు మూడు, ఎస్టీకి కేటాయించిన రూ.21లక్షల ప నులకు మూడు, ఎస్సీకి కేటాయించిన రూ.20.75లక్షల పనులకు మూడు టెండర్లు రాగా, జనరల్‌కు కేటాయించిన రూ.21.60లక్షల పనులకు ఆరు చొ ప్పున మొత్తం 22 టెండర్లు వచ్చాయి. గత నెల 29 మధ్యాహ్నం 3గంటలతో టెండర్‌ గడువు ముగిసింది. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే, టెండర్లు తెరిచిన బల్దియా అధికారులు వాటి పరిశీలన నెపంతో తా త్సారం చేస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చుదామని భావించిన అధికారుల ప్రయత్నం బెడిసికొట్టడంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. పెద్ద మొత్తంలో టెండర్లు దాఖలు కావడంతో బల్లియా అధికారుల పక్షపాత వైఖరి తేటతెల్లమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారి నిర్వాకంపై విమర్శలు వస్తున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు టెండర్ల ఖరారులో జాప్యమే నిదర్శనం. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే నిబంధనల ప్రకారం ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ విషయమై మున్సిపల్‌ ఇంజినీర్‌ పేరిరాజును సంప్రదించగా.. ప్రక్రియకు కసరత్తు చేస్తున్నామని త్వరలోనే వాటిని ఖరారు చేస్తామని తెలిపారు.

ఏం జరిగిందంటే..

మున్సిపల్‌ పరిఽధిలో వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షించే ప్రైవేట్‌ సంస్థ ఒప్పంద గడువు ముగియడంతో ఏడాదిగా బల్దియానే నిర్వహిస్తోంది. వీధి దీపాల నిర్వహణను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని రూ.1.26 కోట్లతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం ఆరు ప్యాకేజీలుగా పనులు విభజించి ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. ఇందులో ఎస్టీకి కేటాయించిన రూ.21లక్షల పనికి ఓ ఏజెన్సీ ముందుకు వచ్చినా నిబంధనల ప్రకారం లేకపోవడంతో తిరస్కరించారు. మరో రూ.21లక్షల పనికి ఇద్దరు టెండర్లు దాఖలు చేయగా తక్కువ ధర కోట్‌ చేసిన ఏజెన్సీకి పనులు కేటాయించారు. మరో ఐదు ప్యాకేజీల పనులకు సింగిల్‌ టెండర్‌ రాగా వారికి కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్‌ రాజర్షి షా ఈ పనులకు రీటెండర్లు నిర్వహించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement