
ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేయొద్దు
● కేంద్ర మంత్రికి విన్నవించిన ‘సోయం’
కై లాస్‌నగర్: ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేలా జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి జుయల్ ఓరామ్‌ను కోరారు. సోమవారం న్యూఢిల్లీలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆదివాసీల సమస్యలు, పోడు భూములకు పట్టాలు, జీవో 49 అంశాలపై మంత్రితో చర్చించి వినతిపత్రం అందజేశారు హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటడం మానుకోవాలని కోరారు. టైగర్ కన్జర్వేషన్ పేరిట ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. గిరిజనులు, గిరినేతలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందించేలా చూడాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించి గిరిజనుల స్థితిగతులను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.