
పర్యాటకంపై ఆర్టీసీ నజర్
ప్యాకేజీ వివరాలు ఇలా..
పర్యాటక ప్రాంతం పెద్దలకు పిల్లలకు
అరుణాచలం రూ.5,200 రూ.3,350
శ్రీశైలం రూ.2,500 రూ.1,500
యాదగిరిగుట్ట రూ.1,600 రూ.1,000
ఆదిలాబాద్: పర్యాటకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఆదాయ వనరులు పెంచుకోవడంలో భాగంగా పలు టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటించింది. పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలకు స్పెషల్ సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యింది.
టూరిజంపై ఫోకస్..
ఆర్టీసీలో గతంలోనే టూరిజం విభాగం ఏర్పాటు చే శారు. పర్యాటకాభివృద్ధి సంస్థతో యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, విశ్రాంతి గదులను ఆర్టీసీ వినియోగించుకోనుంది. ఆదిలాబాద్ నుంచి అరుణాచలం, కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపు ల్, శ్రీ జోగులాంబ దేవి ఆలయం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వంటి పుణ్యక్షేత్రాలకు ఆదిలా బాద్ నుంచి బస్సులు నడపనున్నారు.
స్పెషల్ సర్వీసులు ఇలా..
ఈనెల 9న ఆదిలాబాద్ నుంచిఅరుణాచలానికి ఉద యం 11 గంటలకు ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. అక్కడినుంచి 11న ప్రారంభమై 12వ తేదీ రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. అలాగే ఈనెల 11న ఆదిలాబాద్ నుంచి శ్రీశైలంకు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక సర్వీసు ప్రారంభమై, 12న ఉదయం 8 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 12న ఉదయం 8 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఈ నెల 12న ఆదిలా బాద్ నుంచి యాదగిరి గుట్టకు ఉదయం 5 గంటల కు స్పెషల్ సర్వీస్ ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 7గంటలకు అక్కడినుంచి బయలుదేరి 13నఉదయం 5గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక సర్వీసులు ప్రారంభిస్తున్నాం. తొలుత ఈనెల 9న తమిళనా డులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి స్పెషల్ సర్వీసు నడపనున్నాం. ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. వివరాలకు 7382840068, 7382840115, 9492767879 నంబర్లలో సంప్రదించవచ్చు. పర్యాటకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రతిమారెడ్డి, ఆదిలాబాద్ డిపో మేనేజర్
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు
ఆదిలాబాద్ నుంచి స్పెషల్ బస్సులు