
జాప్యం తొలగేనా..
మార్పు ఫలితంగా జాప్యం తొలుగుతుందా అనేది రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే పరిస్థితుల ద్వారా స్పష్టం కానుంది. ప్రస్తుతం మండల వ్యవసాయ అధికారులు తమ వద్దకు వచ్చే ఇండెంట్‌ను తక్షణం మార్క్‌ఫెడ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఇక్క డ ఏదైనా జాప్యం జరిగితే అందుకు ఆ అధికారి బాధ్యుడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇండెంట్ పరిశీలనతో పాటు సంబంధిత సొసైటీ అందుకు తగ్గట్టుగా డబ్బులు కట్టిందా.. లేదా అనే పరిశీలన చేసి స్టాక్‌ను ఆ పీఏసీఎస్‌కు ఎప్పటికప్పుడు పంపించడం మార్క్‌ఫెడ్ బాధ్యత. ఇక్కడ ఏదైనా లోపం జరిగితే మార్క్‌ఫెడ్ విమర్శల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇదివరకు ఉన్న ఘట్టంలో అన్ని చోట్ల సమయభావంతో సరఫరాలో ఆలస్యం చోటుచేసుకుందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మార్పుల తర్వాత ఎలా ఉంటుందో చూడాల్సిందే.

జాప్యం తొలగేనా..