
జిల్లాకు 20,408 మెట్రిక్ టన్నుల యూరియా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో యూరియా కొరత లేద ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 17వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 20,408 మెట్రి క్ టన్నులు జిల్లాకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో నుంచి 10,222 మెట్రిక్ టన్నులను ప్రాథమి క సహకార సంఘాలు, డీలర్లకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎకై ్సజ్ డీసీగా రఘురాం
ఆదిలాబాద్‌టౌన్: ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌గా కె.రఘురాం బుధవారం పూర్తి అదనపు (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయనకు ఆ శాఖ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. గతంలో రెగ్యులర్ డీసీగా ఉన్న నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ తర్వాత కరీంనగర్ డీసీ రవికాంత్ ఆదిలాబాద్ ఇన్‌చార్జిగా కొనసాగారు. తాజాగా ఆయనను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. హైదరాబాద్ కమి షనరేట్‌లో డీసీ బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురాంకు ఆదిలాబాద్ డీసీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐలు, ఎస్సైలు,కార్యాలయసిబ్బంది డీసీని మర్యా దపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
జంక్షన్ కుదింపుపై సమీక్ష
కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని కుమురంభీం జంక్షన్ కుదింపుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో క లెక్టర్ రాజర్షి షా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ సంఘ నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు. ప్రమాదాలు జరుగుతున్నందున చౌక్‌ను కదించనున్నట్లుగా తెలిపారు. భీం విగ్రహాన్ని కదపకుండా చుట్టూ ఉన్న జంక్షన్‌ను కుదిస్తామన్నారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్‌కలెక్టర్ యువరాజ్‌పాల్గొన్నారు.