
యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా మారాలి●
● ఎస్పీ అఖిల్ మహాజన్
బోథ్: యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా మారి సమాజానికి సేవ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మండలంలోని కౌఠ బీ గ్రామంలో గురువారం స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. జిల్లాలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తె లిపారు. ఎక్కడైనా వీటిని గుర్తిస్తే 8712659973 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు 871265953 నంబర్‌లో షీ టీం ద్వారా సహాయం పొందవచ్చని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విదార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బోథ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉండడాన్ని అభినందించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ హిస్టరీ షీట్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాల సీజ్
ఆదిలాబాద్‌టౌన్: మావల మండల కేంద్రం సమీపంలోని చైతన్య పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డి గురువారం సీజ్ చేశారు. తనకు అందిన ఫిర్యాదు మేరకు డీఈవో గోదాం వద్దకు గురువారం చేరుకోగా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు విక్రయిస్తుండడం కనిపించింది. దీంతో డీఈవో గోదాంలోని పాఠ్య పుస్తకాలను పరిశీలించి షట్టర్లకు తాళాలు వేయించారు. ఎంఈవో సరోజను గోదాం వద్దకు పంపించి సీల్ వేయించారు. 10 రో జుల క్రితం నారాయణ పాఠశాలలో విక్రయించిన పాఠ్యపుస్తకాలనూ ఆదిలా బాద్‌అర్బన్ ఎంఈవో సోమయ్య సీజ్ చేసిన విషయం గమనార్హం.

యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా మారాలి●