
● యూసీఐకి మున్సిపాలిటీ ఎంపిక ● త్వరలో కేంద్ర బృందం పర్య
కైలాస్‌నగర్: పట్టణీకరణ వేగవంతమైన నేపథ్యంలో ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అ భివృద్ధి చేయడం, వందశాతం ఆదాయం సమకూర్చుకునేదిశగా కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఐ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలను ఎంపిక చేయగా ఆదిలాబాద్ మున్సిపాలి టీకి చోటు దక్కింది. దీని అమలుపై మున్సిపల్ అ ధికారులతో హైదరాబాద్‌లోని టీయూఎఫ్‌ఐడీసీ కా ర్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించి పథకం ప్రాధాన్యతను తెలిపారు. పట్టణ స్థితిగతులు, అభివృద్ధి పరంగా చేపట్టాల్సిన చర్యలపై అ ధ్యయనం చేసేందుకు ఈ నెల 10లోపు కేంద్రబృందం రానుంది. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి ఇచ్చే నివేదిక ప్రకా రం తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల క ల్పన సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రుణం రూ పంలో పట్టణాభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు రానున్న ట్లు అధికారులు తెలిపారు. కేంద్ర బృందం పర్యటను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
చేపట్టనున్న పనుల వివరాలు
బట్టిసావర్గాం శివారులోని సర్వే నంబర్ 72లో నూ తనంగా నిర్మించే కలెక్టరేట్ సమీపం గుండా 44వ జాతీయ రహదారి వెళ్తుంది. దానికి ఇరువైపులా ప్రభుత్వ భూములున్నాయి. అక్కడ కమర్షియల్‌తో పాటు రెసిడెన్సియల్ హబ్‌లను నిర్మించేలా ప్రణా ళిక సిద్ధం చేస్తున్నారు. పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ఖరారు చే యనున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా స ర్వీస్ రోడ్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, మల్టీఫ్లెక్స్ మాల్స్, సైక్లింగ్ ట్రాక్, సెంట్రల్ మీడియన్‌లను ని ర్మించనున్నారు. హైదరాబాద్ సిటీ సెంటర్ తరహా లో టౌన్ షిప్‌లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌తో కూ డిన సముదాయ నిర్మాణం చేపట్టనున్నారు. ప ట్ట ణంలోని ప్రజల సౌకర్యార్థం ఎలక్ట్రికల్ బస్సులను నడపనున్నారు. ప్రముఖ ఆలయాలు, బస్టాండ్‌ను అభివృద్ధి చేయనున్నారు. పట్టణంలో వరద కాలువలు నిర్మించనున్నారు. పట్టణ ఆదాయాన్ని పెంచేందుకు ఏం చేస్తే బాగుంటుందనే దిశగా ఆలోచించి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన ఎన్‌సీపీయూ కన్సల్టెంట్ సంస్థ మున్సిపాలిటీలో ఇంటింటికీ సర్వే చేయనుంది. ఆస్తిపన్ను, కుళాయి ట్యాక్స్‌లోని లో పాలను సవరిస్తుంది. వందశాతం పన్నులు రాబట్టేలా చర్యలు చేపట్టనుంది.
ఆదాయం పెంచుతూ అభివృద్ధి చేసేలా..
ఆదిలాబాద్ మున్సిపాలిటీ గ్రేడ్–1 స్థాయికి ఎదిగినప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. అందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్పప్పటికీ ఆఽశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడం అ వరోధంగా మారుతోంది. దీన్ని గుర్తించిన కేంద్రం పట్టణ ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజల భ విష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని అందించాలనే ఉద్దేశంతో యూసీఐకి ఎంపిక చేసింది. పట్టణంలోని దస్నాపూర్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు పాత జాతీయ రహదారికి ఇరువైపులా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా అంచనా వేసింది. అందుకు సంబంధించిన ఫొటోలతో పాటు స్థానిక పరిస్థితులతో కూడిన వివరాలు ప్రభుత్వం సేకరించింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ వివరాలు
పట్టణంలోని వార్డులు : 49
విస్తీర్ణం : 50.69 స్క్వేర్ కిలోమీటర్లు
పట్టణ జనాభా : 2,16, 390
పట్టణంలోని కుటుంబాలు : 48,393
పనుల నివేదిక సిద్ధం చేశాం
‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద మున్సిపాలిటీ ఎంపిక కావడం శుభపరిణామం. దీని అమలుపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద భవిష్యత్ అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. బల్దియా ఆదాయాన్ని వందఽశాతం పెంచేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన స్థితిగతుల అధ్యయానికి కేంద్ర బృందం త్వరలోనే రానుంది. కమిటీ అధ్యయనం చేసిన అంశాల ఆధారంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో నివేదిక సిద్ధం చేస్తాం.
– సీవీఎన్.రాజు,
ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్