
● జిల్లాలో వంటగ్యాస్ దుర్వినియోగం ● పక్కదారి పడుతున్న
కైలాస్‌నగర్: వంటగ్యాస్ వినియోగం పేదలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ అందజేస్తోంది. రూ.432 ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు చెల్లిస్తూ ప్రజలపై భా రం పడకుండా చూస్తోంది. అయితే గృహావసరా లకు వినియోగించాల్సిన ఈ వంటగ్యాస్ జిల్లాలో పక్కదారి పడుతోంది. మార్కెట్‌లో వాణిజ్య సిలిండర్ ధర రెట్టింపుగా ఉండటంతో వ్యాపారులు అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. దీంతో వంటగ్యాస్ దుర్వినియోగమవుతోంది. ప్రతి నెలా వేలాది సిలిండర్లు పక్కదారి పడుతుండగా ప్రభుత్వ ఖజానాపై రూ.లక్షల్లో భారం పడుతోంది.
దొడ్డిదారిన వినియోగం
గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ.932గా ఉంది. అదే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,934గా ఉంది. దీన్ని వినియోగించడం భారంగా మారుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇళ్లలో వంట కోసం వినియోగించాల్సి న ఎల్‌పీజీ సిలిండర్లను అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారు. పలువురు వ్యాపారులు తమ ఇంటితో పాటు తమవద్ద పనిచేసే వారి గృహావసర కనెక్షన్లపై వంట గ్యాస్ బుక్ చేసుకుని తీసుకున్న సిలిండర్లను ఇలా వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. మరికొంత మంది గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో కుమ్మకై ్క సిలిండర్లను అక్రమంగా తెప్పించుకుంటున్నారు. ఇదే అదనుగా డెలివరీ బాయ్స్ అందినకాడికి దండుకుంటున్నారు. తక్కువ సిలిండర్లను వినియోగించే వారి ని గుర్తించి సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారు. జి ల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, ఇ చ్చోడ, బేల, నార్నూర్ తదితర మండల కేంద్రాల్లో ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. మరికొందరు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 14.2 కేజీల సిలిండర్ల ద్వారా ఐదు కేజీల సిలిండర్లను నింపుతూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొంతమంది కార్లలోనూ వినియోగిస్తున్నారు.
20శాతం సిలిండర్లు పక్కదారి
ప్రతి నెలా సుమారు 20శాతం సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయి. దీంతో రూ.లక్షల ప్రజా ధనం అక్రమార్కుల పాలవుతోంది. ఈ అక్రమ దందాకు గాను సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు, ప్రైవేట్ హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నుంచి ప్రతినెలా వేలాది రూపాయలు ‘మామూలు’గా ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సంబంధిత అధికారుల ప్ర మేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగినచర్యలు తీ సుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజీద్ అలీని పలుసార్లు ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.
జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీలు : 17
వంట గ్యాస్ కనెక్షన్లు : 2,88,346
జనరల్ కనెక్షన్లు : 2,05,250
దీపం కనెక్షన్లు : 56,136
ఉజ్వల కనెక్షన్లు : 36,960