
విధుల్లో చేరిన ఏడీఏలకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వ్యవసాయశాఖలో ముగ్గు రు ఏడీఏలు గురువారం విధుల్లో చేరారు. గత ఆగస్టులో నిర్వహించిన బదిలీల్లో జిల్లాలో పనిచేసిన ఇద్దరు ఏడీఏలు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లగా, భూసార ఏడీఏ పోస్టు కొద్దిరోజులుగా ఖాళీగా ఉంది. ఎట్టకేలకు ఈ మూడు పోస్టులు భర్తీ అయ్యా యి. ఇటీవల ఏవోలకు ప్రమోషన్లు కల్పించారు. వ రంగల్ జిల్లాలో ఏడీఏగా పనిచేస్తున్న శ్రీధర్ బది లీపై వచ్చి ఆదిలాబాద్ ఏడీఏగా బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లా బాసరలో ఏవోగా పనిచేస్తున్న శ్రీకాంత్ ప్రమోషన్‌పై భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా, నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీని వాస్ ప్రమోషన్‌పై రైతు శిక్షణ కేంద్రం ఏడీఏగా వి ధుల్లో చేరారు. వీరు అంతకుముందు డీఏవో శ్రీధర్‌స్వామిని కలిసి రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా వారిని డీఏవో శాలువాలతో సన్మానించారు. వ్యవసాయశాఖ అధికారులు శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.