
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నక్షత్ర ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. విధులు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలు, చార్జెస్ బోర్డు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, డయాగ్నొస్టిక్ సర్వీసుల ప్రమాణాలు, ఆరోగ్యశ్రీ సేవల రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో కార్డియాక్ట్ కన్సల్టెంట్ పేరు ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. ప్రదర్శించిన ధరకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ కలిగిన ఫార్మాసిస్టులు పనిచేయాలని ఆదేశించారు. పరిశీలనలో వచ్చి న లోపాలు తక్షణమే సవరించుకోవాలన్నా రు. కలెక్టర్‌వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఎన్‌సీడీ అధికారి శ్రీధర్ తదితరులున్నారు.