
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే అనిల్ జాదవ్
కై లాస్‌నగర్: రైతులకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. బోథ్ నియోజకవర్గంలోని సాగునీటి పరమైన అంశాలపై జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పిప్పల్‌కోటి, దేగామ రిజర్వాయర్ల భూ నిర్వాసితుల సమస్యలపై ఆరా తీశారు. తేజాపూర్, బుగ్గారం, పిప్రి, లిఫ్ట్‌ఇరిగేషన్ల పథకాలపై వివరాలు అడిగి తె లుసుకున్నారు. అడెగామ, కజ్జర్ల, మత్తడివాగు, చింతలబొరి, సీతాగొంది కెనాల్స్ మరమ్మతులు, మత్తడివాగు బ్రిడ్జిల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో కొనసాగుతున్న 11 చెక్‌డ్యాంల పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నింటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే నియోజకవర్గ పరిధిలో కొత్తగా 11చెరువుల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనల ను పంపించాలన్నారు. ఇందులో ఇరిగేషన్‌శాఖ అధి కారులు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.