148 పోస్టులు ఖాళీ..
వైద్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది కలిపి 463 పోస్టులకు గాను ప్రస్తుతం 315 మంది పనిచేస్తున్నారు. 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆది లాబాద్ పట్టణంలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, చిల్కూరిలక్ష్మీనగర్‌లో మా త్రమే వైద్యుడు పనిచేస్తుండగా, పుత్లీబౌళి, హమాలీవాడ, శాంతినగర్, ఖుర్షీద్‌నగర్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటేషన్‌పై ఇక్కడ వైద్యులు పనిచేస్తున్నారు. దీంతో సంబంధిత పీహెచ్‌సీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు మూడు, యూహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు, స్టాఫ్‌నర్సులు మూడు, ఏఎన్‌ఎంలు 43, ల్యాబ్ టెక్నీషియన్లు ఐదు, ఫార్మాసిస్టులు 10, ఎంపీహెచ్‌డబ్ల్యూ మేల్ 63 పోస్టులు ఖాళీగాఉన్నాయి. వీరితోపాటు వాచ్‌మెన్, అటెండర్లు, ల్యాబ్ అటెండెంట్లు, హెల్పర్లు, స్వీపర్లు, ఇతర సిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్‌టౌన్/ఇచ్చోడ: జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, సబ్‌సెంటర్లలో పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు. చాలాచోట్ల వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పని పరి స్థితి. 24 గంటల పాటు పనిచేసే పీహెచ్‌సీల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నచోట వారు గ్రామాలకు వెళ్లి వైద్యం అందించే క్రమంలో ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందని దుస్థితి. ఉట్నూర్‌లోని జిల్లా ఆస్పత్రి పరిస్థితి మరింత దారుణం. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ కాకపోవడంతో గిరిజనులకు వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. ఏ వైద్యానికై నా అక్కడి వైద్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కే రెఫర్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయంలో పెద్దాసుపత్రికి తరలించే లోపే క్షతగాత్రుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో పలు పీహెచ్‌సీల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. పలువురు వైద్యులు పీహెచ్‌సీకి చేరుకున్నప్పటికీ పలుచోట్ల సమయపాలన పాటించడం లేదు. వారి కోసం రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. శుక్రవారం ‘సాక్షి’ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్‌సెంటర్లు, రిమ్స్‌ను తనిఖీ చేయగా, పలు విషయాలు బయటపడ్డాయి.
● సమయపాలన అంతంతే.. ● సర్కారు ఆసుపత్రుల్లో వెక్కిరిస్తున
● సమయపాలన అంతంతే.. ● సర్కారు ఆసుపత్రుల్లో వెక్కిరిస్తున
● సమయపాలన అంతంతే.. ● సర్కారు ఆసుపత్రుల్లో వెక్కిరిస్తున