
ఆ బడి తాళం తెరుచుకుంది..
బోథ్: సొనాల మండలంలోని మహాదుగూడ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు మెటర్నిటి సెలవులో ఉండడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజలు దాటినా ఇంకా బడి తెరుచుకోలేదు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్న తీరుపై ‘బడి తాళం తీసేదెప్పుడో ?’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఇక్కడ ఓ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై నియమించారు. మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్ పాఠశాలను ఉదయం పరిశీలించారు. ఇక ఉపాధ్యాయుల కొరత రానివ్వమని పేర్కొన్నారు. బజార్‌హత్నూర్ మండలం నుంచి మధుకర్ అనే ఉపాధ్యాయుడిని ఇక్కడ నియమించినట్లు వెల్లడించారు. కాగా ‘సాక్షి’ చొరవను తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
మహదుగూడ పాఠశాలకు ఉపాధ్యాయుడు..
డిప్యూటేషన్‌పై నియమించిన అధికారులు

ఆ బడి తాళం తెరుచుకుంది..