అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి

Jul 3 2025 5:12 AM | Updated on Jul 3 2025 5:12 AM

అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి

అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. కొత్తగా ఎంపికై న సభ్యులకు తొలు త నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు కో సమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నా రు. ప్రభుత్వ ఫలాలు ఎస్సీ, ఎస్టీలకు అందించేలా కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముందుగా జిల్లా షె డ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీతాకుమారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చట్టంలోని విధివిధానాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అందిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ దరఖా స్తుపై నిష్పక్షపాతంగా స్పందించాలన్నారు. వాటిని భూరికార్డులతో సరిపోల్చి, పూర్తిస్థాయిలో ధ్రువీకరించిన తర్వాతే తగు నిర్ణయాలు తీసుకోవాలన్నా రు. సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్‌ లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించా రు. ఇందులో అదనపుకలెక్టర్‌ శ్యామలాదేవి, ట్రెయి నీ కలెక్టర్‌ సలోని, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ఆర్డీవో వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలి

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మండలస్థాయిలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక రవాణా జరిగేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఇందులో గ్రౌండ్‌వాటర్‌ ఏడీ శ్రీవల్లి, మైనింగ్‌ ఏడీ రవీందర్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రాజేందర్‌, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈలు రాథోడ్‌ శివరాం, నర్సయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement