
బడి తాళం తీసేదెప్పుడో?
● 20 రోజులవుతున్నా ప్రారంభం కాని తరగతులు
టీచర్ రాకపోవడంతో
ఆవరణలో చదువుకుంటున్న విద్యార్థులు
బడి ఉంది.. విద్యార్థులూ ఉన్నారు.. కానీ బోధించేవారే కరువయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గుడస్తున్నా ఆ చిన్నారులకు మాత్రం ఇంకా పాఠాలు అందని పరిస్థితి. సొనాల మండలం మహదుగూడ గ్రామ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువు కు దూరమవుతున్నారు. ఇందులో 20 మంది విద్యార్థులు ఉండగా.. ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. జూన్ 12న నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా తరగతులు షురూ కాకపోవడం గమనార్హం. ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఆవరణలో కాసేపు చదువుకొని వెళ్లిపోతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీని వాస్‌ను వివరణ కోరగా.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో ఉన్నట్లు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించగా డిప్యూటేషన్‌పై తాజాగా ఒకరిని కేటాయించారని, బుధవారం నుంచి ఉపాధ్యాయుడు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. – బోథ్