
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రా ణించిన క్రీడాకారులంతా రాష్ట్రస్థాయి పోటీల్లో నూ సత్తాచాటాలని జిల్లా గిరిజన క్రీడల అధి కారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి అండర్– 10, 12, 14 అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయ న ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ.. జిల్లాఅథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తర చూ పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. నిరంతర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చని క్రీడాకారులకు సూ చించారు. అసోసియేషన్ సెక్రెటరీ పిట్ల రాజేశ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరి చిన క్రీడాకారులు ఈనెల 6 నుంచి హన్మకొండ వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందులో అసోసియేషన్ ట్రెజరర్ రాకేష్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ జ్యోతి స్వరన్ తదితరులు పాల్గొన్నారు.