
నాణ్యమైన సేవలందించాలి
ఆదిలాబాద్‌టౌన్: వైద్యులు రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ను వైద్యులు, సిబ్బంది శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బెస్ట్‌ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్‌డే నిర్వహించారు. వైద్యులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఇందులో వైద్యులు శిరీష్, కళ్యాణ్‌రెడ్డి, భానుప్రకాశ్, నర్సింగ్ సూపరింటెండెంట్ రమాదేవి, దీపక్ పుష్కర్, అశ్విన్‌రాథోడ్, విజయలక్ష్మి, సింధూ జ, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీబీ కార్యాలయంలో..
జిల్లా టీబీ కార్యాలయంలో డాక్టర్స్‌డే ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారి సాయిప్రియను ఉద్యోగులు శాలువాతో సన్మానించారు. ఇందులో వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.