
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా బీఆర్‌ఎస్..
● డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
కై లాస్‌నగర్: బీఆర్‌ఎస్ పార్టీ అనేది పైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, అందులోని నాయకులు ఆ కంపెనీ ఓనర్ దొర చెప్పినట్టుగా నడుచుకోవడమే తప్ప ప్రత్యేకంగా చేసేదేమి ఉండదని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాసేవ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలు, అధికార యంత్రాంగం పనితీరు సమీక్షించేందుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యటన తీవ్ర నిరాశ మిగిల్చిందని మాజీ మంత్రి రామన్న విమర్శించడం హస్యాస్పస్పదంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లాకు గతంలో ఏం ఒరగబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. సొంత అభివృద్ధి గురించి ఆలోచించారే తప్ప ప్రజల క్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 15నెలల్లో చేసి చూపిందన్నారు. హైదరాబాద్‌లో మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ నాయకులు గుండాల్లా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో నాయకులు సంతోష్, నర్సింగ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.