
వారికి అనుమతివ్వొద్దు..
కైలాస్‌నగర్: పట్టణంలో తొలగించిన వీధి వ్యా పారులను మళ్లీ అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, శివాజీ చౌక్‌ల్లో వ్యాపారం కొనసాగించేలా అవకాశం ఇవ్వొద్దని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి నిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అధ్యక్షుడు దినేశ్ మటోలియా మాట్లాడుతూ.. అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, శివాజీ చౌక్‌ల్లో మళ్లీ తోపుడుబండ్ల ను ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లుగా తెలు స్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిబండ్లు పెట్టి వ్యాపారం చేయించాలని చూస్తే తాము కూడా దు కాణాలు మూసి వేసి రోడ్లపైకి వచ్చి వ్యాపారం చేస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘ నాయకులు తదితరులున్నారు.