
గాండ్ల సంఘం బలోపేతమే లక్ష్యం
ఆదిలాబాద్‌రూరల్: గాండ్ల సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర కమిటీ బాధ్యులు భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కులపెద్దలు పలు సమస్యలు ప్రస్తావించగా.. వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని సంఘ బాధ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమనగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బొల్లం శ్రీహరి, జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నంవార్ రాజేశ్వర్, తమ్మలవార్ చందు, జక్కం సంపత్, వీరసుందరం, శ్రీధర్, దత్తు, నగేశ్, విలాస్ పాల్గొన్నారు.