
అనుమతి లేకుండా ఫ్లెక్సీలు
● బల్దియాకు ఆర్థిక నష్టం ● ప్రకటనలకే పరిమితమైన రూ.5వేల జరిమానా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చౌక్‌ల్లో కొంత మంది రాజకీయ, యువజన, కుల, ప్రజాసంఘాల నాయకులు జన్మదిన, వివిధ పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతూ బల్దియా నుంచి అనుమతి లేకుండా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, వినాయక్‌చౌక్, వివేకానంద చౌక్, పంజాబ్‌చౌక్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని హోర్డింగ్‌లకు ఏర్పాటు చేయకుండా పట్టణ సుందరీకరణలో భాగంగా బల్దియా ఏర్పాటు చేసిన రెయిలింగ్‌లకు వైర్లతో కడుతున్నారు. దీంతో ఈదురుగాలుల తీవ్రతకు ఆ ప్రచార ఫ్లెక్సీలు కూలిపోవడంతో రెయిలింగ్‌లు విరిగిపోతున్నాయి. ఫలితంగా బల్దియాకు ఆర్థికనష్టం వాటిల్లుతోంది. ఇటీవల ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ఈదురుగాలుల తీవ్రతకు రెయిలింగ్ విరిగి కిందపడింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ వాహనదారుడిపై పడే అవకాశముండగా తృటిలో ప్రమాదం తప్పింది. అయినా బల్దియా అధికారులు మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామనే బల్దియా అధికారుల మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇప్పటికై నా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.