
No Headline
ఇటీవల సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో పదమూడేళ్ల బాలుడు మొబైల్ ఫోన్‌కు బాగా అలవాటుపడ్డాడు. రో జంతా సెల్‌ఫోన్లలో సోషల్ మీడియా, రీల్స్ తదితర మాధ్యమాల్లో మునిగితేలుతుండడంతో ఆ అలవాటు మాన్పించాలని అతని తండ్రి మందలించాడు. అయితే మనస్తాపానికి గు రైన ఆ యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిర్మల్ సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9 గంటల తర్వాత దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల లోపు యువకులు ద్విచక్ర వాహనాలపై ఇష్టారీతిన నడుపుకుంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. ఆరా తీస్తే అప్పటికే వారు దాబాహోటల్‌లో మద్యం సేవించి ఇంటికి తిరిగి వస్తున్నట్టు తెలిసింది. పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మందలించి ఇంటికి పంపించారు.