breaking news
woamn Illegal Relation
-
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
మేమేం పాపం చేశాం..
♦ నాన్నను చంపేశారు.. ♦ అమ్మను అరెస్ట్ చేశారు.. ♦ బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు రామభద్రపురం: ఏం జరుగుతుందో ఆ చిన్నారులకు తెలియడం లేదు.. ఇంటికి పోలీసులెందుకు వస్తున్నారో..తల్లిని ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక బిత్తర చూపులు చూస్తున్నారు. నాన్న కనిపించడు.. అమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఉంది.. ఈ పరిస్థితుల్లో చిన్నారుల బేల చూపులు బంధువులు, స్థానికులను కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... బాడంగి మండలం కోటిపల్లికి చెందిన కొయ్యాన ధనుంజయను (29)ను అతని భార్య రామలక్ష్మి, ఆమె ప్రియుడు బోగాది గణపతి హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గణపతి కూడా కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఉన్న ఒక్క నిందితురాలు రామలక్ష్మిని విచారణ నిమిత్తం సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమ్మ వెంటే.. ధనుంజయ, రామలక్ష్మి దంపతులకు హరి (7), ఉమ (3) పిల్లలున్నారు. ధనుంజయ హత్యకు గురికావడం.. తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండడంతో హరి భయపడతాడని భావించిన బంధువులు అతడ్ని తాత గారింటికి పంపించి వేశారు. కుమార్తె ఉమ మాత్రం తల్లితోనే ఉంది. తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో కూడా ఏమీ తెలియని చిన్నారి ఆమె వెంటే స్టేషన్‌కు వెళ్లింది. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి అక్కడే ఆడుకోవడం చూసి స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కొంపముంచుతున్న అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న అక్రమ సంబంధాల వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయని పలువురు తెలిపారు. తల్లి చేతిలో తండ్రి బలయ్యాడు.. తల్లి పోలీసుల అదుపులో ఉంది.. ఇటువంటి సమయంలో పిల్లలను ఎలా ఊరడించాలో తెలియక బంధువులు తల్లడిల్లుతున్నారు