breaking news
wemust
-
మహాసభలను విజయవంతం చేయాలి
నాంపల్లి : అక్టోబర్ 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో జరిగే జాతీయ మహసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అ«ధ్యక్షుడు బుడిగపాక జగన్∙అన్నారు. అదివారం స్థానిక సీపీఐ కార్యలయంలో ప్రజానాట్యమండలి ముఖ్య కార్యకర్తల సమావేశాశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మహసభల కరపత్రాని విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హేతువాదులపై, రచయిత, కవులపై ఉక్కుపాదం మోపుతూ అణిచివేస్తుందన్నారు. ఈ జాతీయ మహసభలు నూతన కళారూపాలను ప్రదర్శించేందుకు , ప్రభుత్వం అవలంభిసుత్నS్న విధానాలపై కళాగళాలను పదును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కలకొండ జంజీవ, ఊరుపక్క వెంకటయ్య, మొగుదల సైదమ్మ, మహేష్, మురళి, తదితరులున్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కట్టంగూర్ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి పైలం సంతోష్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆరోగ్యశాఖ, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో సారథి కళాకారులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కల్గిఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వెంకట్, సంధ్యారాణి, తాటిపాముల శంకర్, వెంకట్ తదితరులున్నారు.