breaking news
Vertebral
-
నడుంనొప్పి: హోమియోపతి చికిత్స
(లాంబార్ స్పాండిలోసిస్) ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య నడుంనొప్పి(లాంబార్ స్పాండిలోసిస్). ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లాంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. నడుమునొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో నిర్మితమైన వెన్నెముక, వెన్నెముకలోని ప్రతి రెండు వెన్ను - ఎముకల మధ్య మృదులాస్థితో నిర్మితమైన ‘డిస్క్’లు మనం వంగినా, లేచినా ఈ డిస్క్లే తోడ్పడుతాయి. అయితే అసంబద్ధ భంగిమలలో ఎక్కువసేపు కూర్చోవడం, ఒకేచోట ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని విధులు నిర్వర్తించటం, వంగి ఉండి తీవ్రమైన శారీరక శ్రమ చేయడం, తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి తగినంత లేకపోవడం మొ॥లగు కారణాల వల్ల నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవడం, ప్రక్కకు తప్పుకోవడం ఆస్టియోపైట్స్ (అనవసరమైన ఎముక పెరుగుదల) ఏర్పడడం వల్ల నడుము నొప్పి సమస్య ఉత్పన్నమగును. దీనినే ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’ అంటారు. లక్షణాలు: నడుము నొప్పి తీవ్రముగా ఉండి, ఎటువైపు వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి పెరుగును. డిస్క్‌లు ప్రక్కకు జరిగినప్పుడు అక్కడి నుండి వెళ్ళే నాడులపై పడే ఒత్తిడి కారణంగా నొప్పి ఎడమ లేదా కుడి కాలుకు వ్యాపిం చి బాధిస్తాయి. నొప్పితో పాటు ఒత్తిడి తీవ్రత ఎక్కువైతే తిమ్మిర్లు కూడా వ్యాపిస్తూంటాయి. హఠాత్తుగా వంగినా, బరువులు ఎైతినా ఒక్కసారిగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతూంటారు. జాగ్రత్తలు: నడుము నొప్పితో బాధపడే వారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా ఎత్తకూడదు. బల్లమీద కాని, నేల మీద కాని పడుకోవాలి. నడుము నొప్పి రాకుండా ఉండటానికి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. చికిత్స: హోమియోపతి వైద్య విధానంలో ‘‘లాంబార్ స్పాండిలోసిస్’’కు పూర్తి ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు గల కారణాలు మరియు వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. సాధారణంగా బ్రయోనియా, రూటా, రస్టాక్స్, మాగ్‌ఫాస్, ఆర్నికా మొ॥మందులను నడుమునొప్పికి వాడుతుంటారు. అయితే వీటిని వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యుల సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి (ఎం.డి హోమియో) స్టార్ హోమియోపతి. సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరెడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు కర్నాటక అంతటా.. ఫోన్: 7416 102 102 www.starhomeo.com -
జిరియాట్రిక్స్ - ఆధునిక హోమియో చికిత్స
సత్యమూర్తి అనే స్కూల్ హెడ్మాస్టర్ రిటైర్ అయ్యే సమయం... హుందాగా సన్మానం చేసి, పూలదండలు వేసి అభిమానంతో పలకరిస్తూ ఉంటే... సత్యమూర్తిగారి ఆనందానికి అవధులు లేవు. దానితోపాటు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని బాధతో నిండిన మనసుతో వీడ్కోలు తీసుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో సమయం అంటే తెలియక కాలం గడిచిపోయింది. కొంతకాలం తరువాత ఒకరోజు సత్యమూర్తి కుర్చీలోంచి హఠాత్తుగా లేవబోయి కాలు కింద మోపలేక కింద పడిపోయారు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారుపడి వైద్యుడి దగ్గరకు పరుగులు తీశారు. సత్యమూర్తిని పరీక్షించిన డాక్టరు ఆస్టియోపోరోసిస్ వల్ల కాలు ఫ్రాక్చర్ అయ్యిందని నిర్థారణ చేశారు. అప్పటి నుంచి సత్యమూర్తి మంచానపడ్డారు. ఆస్టియోపోరోసిస్- ఆస్టియో ఆర్థరైటిస్-జిరియా ట్రిక్స్ సంబంధమేమిటి? ఇది వృద్ధులలో ఎందుకు ఎక్కువ అన్నది తెలుసుకుందాం. జిరియాట్రిక్స్ అంటే ఏమిటి? వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే దానిని జిరియాట్రిక్స్ అంటారు. ఈ పదం గ్రీకు భాష నుంచి కనుగొనబడింది. Geron అంటే old man. Iatros అంటే heals అని అర్థం. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవ టం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, వచ్చిన వ్యాధులకు మంచి చికిత్స ఇవ్వటం దీని ముఖ్య ఉద్దేశం. అరవైఐదు ఏళ్ళు పైబడినవారికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల సరిగ్గా నిలబడలేక పోవటం, నడవలేకపోవటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, విసర్జనాలను ఆపుకోలేకపోవటం, చూపు మందగించ టం, వినికిడి తగ్గిపోవటం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా డిలిరియమ్, మానసిక ఒత్తిడికి గురి కావటం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం. కొంతమందిలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోవచ్చు. కొంతమంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండొచ్చు. ఈ సమస్యలన్నీ జిరియాట్రిక్స్ అనే విభాగంలో పొందుపరచబడతాయి. వృద్ధులకు మంచి చికిత్స ఇవ్వటానికి ఒక ప్రత్యేక వైద్యుని నియమిస్తారు. వారినే Geriatrician అంటారు. ఈ విభాగం మొదటిసారిగా 1942లో అమెరికాలో స్థాపించబడినది. ఆస్టియో ఆర్థరైటిస్ : ఎముకలలో ఉండే Cartilage కీళ్ళ మధ్య ఒక కుషన్లాగ పనిచేస్తుంది. వయస్సులో వచ్చే మార్పుల వల్ల కార్టిలేజ్ తరిగిపోవటం degenerative మార్పుల వల్ల రెండు ఎముకలు ఒక దానికొకటి రాసుకోవటం జరిగి కీళ్ళనొప్పికి దారి తీస్తుంది. దీనినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇది ఎక్కువగా వృద్ధులలో వచ్చే సమస్య. అందుకే దీనిని ‘ఓల్డ్పర్సన్స్ ఆర్థరైటిస్’ అని కూడా అంటారు. ఎముకలు ఇన్ఫ్లమేషన్కి గురై ఎక్కువ బరువు మోపటంతో కీళ్ళ నొప్పి వస్తుంది. అంతేకాకుండా కాలు కదపలేకపోవటం జరుగుతుంది. ఇది ఎక్కువగా 45 ఏళ్ళు పైబడిన వారిలో మగవారి కంటే స్త్రీలలో ఎక్కువ, అంతేకాకుండా కీళ్ళకు దెబ్బలు తగిలి ఇన్ఫ్లమేషన్ రావటం, యాక్సిడెంట్స్ వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఊబకాయం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్‌కి గురవుతున్నాయి. వంశానుగత కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. లక్షణాలు: 85 శాతం మందిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నా ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్థారణ అవుతుంది. 35-50 శాతం మందిలో వ్యాధి లక్షణాలు తక్కువ నుంచి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చేతి కీళ్ల నొప్పులతో స్త్రీలు పనిచెయ్యడానికి ఇబ్బంది పడుతుంటారు. బరువు మోపే కీళ్ళు... knees, hips, feet and the back ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. మొదట ఒకటి రెండు కీళ్ళలో నొప్పి ఉండి స్టిఫ్‌గా ఉంటాయి. కదలికలు కష్టంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువసేపు నిలబడలేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేక పోవటం, రాత్రిపూట నొప్పి ఎక్కువ, చల్లగాలికి నొప్పులు ఎక్కువ అవ్వటం కింద కూర్చోనివ్వలేక పోవడం వీటి ముఖ్య లక్షణాలు. ఆస్టియో పోరోసిస్: వృద్ధాప్యం వల్ల ఎముకలల్లో ఉన్న సాంద్రత (bone mass) కోల్పోయి, కణజాలం ఆకృతి, నాణ్యతను కోల్పోయి, ఎముకలలో ఉండే శక్తి తగ్గిపోతుంది. దీనినే ఆస్టియో పోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్‌లో ఎముకలు ఎక్కువగా ఫ్రాక్చర్‌కు గురవుతాయి. ఎముకల బలహీనత, bone mass తగ్గిపోవటం మగవాళ్ళ కన్నా స్త్రీలలో ఎక్కువ, 35 శాతం స్త్రీలలో నెలసరి ఆగిపోయిన తరువాత కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. మగవారిలో స్త్రీల కంటే bone mass ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరగటంతో రక్తంలో టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్స్, అడ్రినల్ యాండ్రోజెన్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనితోపాటు వారి జీవన విధానం, న్యూట్రిషనల్ డెఫీషియన్సీ ముఖ్యంగా క్యాల్షియం, ప్రోటీన్ డెఫీషియన్సీ, బోన్ మాస్ తగ్గించటానికి కారణమవుతాయి. లక్షణాలు: కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండక ఎముక బలహీనత వల్ల ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదముంది. అదే మన సత్యమూర్తికి జరిగిన ప్రమాదం. ముఖ్యంగా wrist, humerus, hip, ribs ఎముకలు ఫ్రాక్చర్స్‌కు గురవుతున్నాయి. వెన్నుపూస ఎముకల బలహీనత వల్ల నడుమునొప్పి రావటం దీని ముఖ్య లక్షణం. మోకాళ్ళ కీళ్ళలో బోన్ మాస్ తగ్గి నొప్పి, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, కొంతమందిలో వెన్నుపూస వంగిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చెయ్యవచ్చు: స్త్రీల నెలసరి ఆగిపోయిన తర్వాత తమ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉంది. 40-50 ఏళ్ళు పైబడినవారు వైద్యుడిని సంప్రదించటం వలన ఆస్టియో పోరోసిస్ రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకొని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. హోమియో చికిత్స హోమియో చికిత్స వలన ఆస్టియో పోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్‌లను అరికట్టే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్హోమియోపతిలో ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ మీద రీసెర్చ్ చేసి గొప్ప అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్లచే రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలను, వ్యాధి లక్షణాలను పరిశోధన చేసి వారికి సరిపడే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వబడుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ శరీరంలోని క్యాల్షియం డెఫీషియన్సీని, ప్రొటీన్ డెఫీషియన్సీ, హార్మోన్స్‌ను సరైన క్రమంలో జరుగుటకు, బోన్ మాస్, బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి దోహదపడతాయి. వీటితో పాటు ఆహార నియమాలు, అవసరమైన వ్యాయామాలు, మంచి సలహాలు ఇవ్వబడతాయి. హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని కాల్కేరియా గ్రూపునకు సంబంధించినవి. ఎక్కువగా ఎముకలు, కీళ్ళ మీద ప్రభావం చూపి ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. నేట్రమ్ గ్రూపు, ఫాస్ఫరస్, రస్టాక్స్ మొదలైనవి ఎక్కువగా ఎముకల మీద ప్రభావం చూపి బోన్ స్ట్రెంగ్త్ పెంచుతాయి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ను చాలావరకు పరిష్కరించవచ్చు. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 903000 8854 / 90300 81875