breaking news
Venkataramana Colony
-
గవర్నర్ చొరవతో పార్కుకు మోక్షం
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్‌లోని వెంకటరమణకాలనీ పార్కుకు మోక్షం లభించింది. సుమారు 1,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలం కబ్జా కాకుండా ఫెన్సింగ్ వేశారు. పార్కులో ఎర్రమట్టిని నింపడంతోపాటు పార్కులో కొంతకాలంగా స్థానికులు పడవేస్తున్న గుట్టలుగా పోగుపడిన వ్యర్థాలను 30 లారీల్లో తరలించడంతో దుర్గందం, అపరిశుభ్రత నుంచి ఈ పార్కుకు మోక్షం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. గవర్నర్ చొరవతో ఆనంద్‌నగర్ కాలనీలోని మసీదు వద్దనున్న పాత ఇంటిలో పోసిన చెత్తను సైతం బల్దియా సిబ్బంది తొలగించారు. గవర్నర్ ఆదేశాలతో స్థానికంగా ఉన్న పద్మానగర్ పార్కు అభివద్ధికి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఇంత దారుణమా..?
పంజగుట్ట,న్యూస్‌లైన్: వెంకటరమణకాలనీలోని వివాదాస్పద పార్కు విషయమై అసెంబ్లీలో చర్చించి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే దోచుకోవడం దారుణమని వాపోయారు. ఆదివారం పంజగుట్ట డివిజన్ వెంకటరమణకాలనీ కబ్జాకు గురైన పార్కును అఖిలపక్ష నాయకులు, ప్రజా, కులసంఘాల నాయకులు సందర్శించారు. అనంతరం కమ్యూనిటీ హాల్లోసమావేశం నిర్వహిం చారు. దీనికి ఎర్రబెల్లితోపాటు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, మాజీఎంపీ మధు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డి, లోక్‌సత్తా పార్టీ నగర అధ్యక్షుడు దోసపాటి రాము, మాలమహానాడు తెలంగాణ జిల్లాల ఇన్చార్జి పాలడుగు అనిల్‌కుమార్, మాలలసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, బీజేపీ నాయకురాలు ఛాయాదేవి, అమ్ఆద్మీ పార్టీ నాయకులు, యూత్ ఫర్ బెటర్ హైదరాబాద్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈ పార్కు విషయమై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కాలనీవాసులకు న్యాయం జరిగేలా పోరాడుతానని భరోసాఇచ్చారు. దత్తాత్రేయ మాట్లాడుతూ నగరంలో కబ్జావుతున్న పార్కులు,శ్మశానవాటికలు, ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించి ప్రజాప్రతినిధులంతా కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లను కలుస్తామని చెప్పారు. మాజీఎంపీ మధు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధి పార్కును కబ్జా చేస్తుంటే..నగరానికి చెందిన ఓ మంత్రి ఆయనకు వత్తాసు పలకడం హేయమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ పార్కు స్థలాన్ని వెంటనే శుభ్రం చేయిస్తానని టీవీ చానెల్లో బహిరంగంగా చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని వాపోయారు.