Veeru Devgan
-
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్‌గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.దానివల్లే కోలుకున్నా..త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్‌ను బీర్లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్‌రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్‌గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.సినిమాపరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
వీరు దేవగణ్ ఇకలేరు
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్, అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ సోమవారం తుది శ్వాస విడిచారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో వీరు దేవగణ్‌ను ముంబైలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో చనిపోయారాయన. సోమవారం సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. వీరు దేవగణ్ సుమారు 80 సినిమాలకు పైనే స్టంట్‌మేన్‌గా పని చేశారు. ‘హిందుస్తాన్‌కి కసమ్’ (1999) సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, వీరు దేవగణ్ కుమారుడు అజయ్ దేవగణ్, మనీషా కొయిరాల నటించారు. ఓ సందర్భంలో తన తండ్రి గురించి అజయ్ మాట్లాడుతూ – ‘‘నా జీవితంలో నిజమైన సింగం (సింహం) మా నాన్నగారే. జేబులో డబ్బులతో కాకుండా కేవలం ఆశలతో ముంబైలో అడుగుపెట్టారు. తినడానికి తిండి కూడా లేకుండా తన గోల్ కోసం కష్టపడ్డారు. స్ట్రీట్ ఫైటర్ అయ్యారు. ఆ తర్వాత యాక్టర్ రవి ఖన్నా మా నాన్నను చూసి సినిమాల్లో పని చేయమని కోరారు. అక్కడి నుంచి ఇండియాలోనే టాప్ యాక్షన్ డైరెక్టర్‌గా నాన్న ఎదిగారు. ఆయన ఒంట్లో విరగని ఎముక లేదు. తల మీద సుమారు 50 కుట్లుపైనే ఉన్నాయి. అందుకే ఆయనే నా నిజమైన సింగం’’ అని పేర్కొన్నారు. 1970లలో కెరీర్ ఆరంభించిన వీరు దేవగణ్ దాదాపు 80 చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. వాటిలో మిస్టర్ ఇండియా, రామ్ తేరీ గంగా మైలీ, ఇంక్విలాబ్, హిమ్మత్వాలా వంటి చిత్రాలు ఉన్నాయి. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి యాక్షన్ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత కూడా తనయుడి సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. వీరు దేవగణ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
హీరో అజయ్ దేవగన్ నివాసంలో విషాదం
సాక్షి, ముంబయి : బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ నివాసంలో విషాదం నెలకొంది. అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ వీరు దేవగన్ సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని సూర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. సుమారు 80కి పైగా బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన వీరు దేవగన్.. నటుడిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. అలాగే తన కుమారుడు అజయ్ దేవగన్ హీరోగా హిందూస్థాన్ కీ కసమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా వీరు దేవగన్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6గంటలకు విలే పార్లే శ్మాశాన వాటికలో జరగనున్నాయి. వీరు దేవగన్ మృతిపట్ల సంతాపం పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపంత తెలుపుతూ...అజయ్ దేవగన్‌కు సానుభూతి తెలిపారు. -
'బాలీవుడ్ ఫైట్స్ బోర్ కొడుతున్నాయి'
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతున్న శివాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అజయ్, తనకు బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొడుతున్నాయంటూ కామెంట్ చేశాడు. ఫైట్ మాస్టర్ వీర్ దేవగన్ వారసుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్, యాక్షన్ సీన్స్‌పై చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న శివాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న అజయ్ ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొట్టాయన్న అజయ్ దేవగన్, తన సినిమాతో కొత్త తరహా యాక్షన్‌ను ట్రై చేశానని ప్రకటించాడు. 2008లో తెరకెక్కిన 'యు మీ ఔర్ హమ్' సినిమాతో మెగాఫోన్ పట్టిన అజయ్, రెండో ప్రయత్నంగా శివాయ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా వాయిదా వేసినట్టుగా తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో అఖిల్ ఫేం సయేషా సైగల్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది.