-
హనీ పాప అదిరిపోయే లుక్.. ఈసారి ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. తాజాగా ఓ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్‌తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్‌లో స్టేజీపై అదరగొట్టేసింది. Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94 — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9 — Honey Rose (@HoneyRoseNET) January 22, 2024 -
ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా ఆయన విలన్ పాత్ర పోషించాడు. అక్కడ చిత్ర సీమలో ఆయనకు తనదైన స్టార్డమ్ ఉంది. దునియా విజయ్ కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించారు. తన స్వగ్రామంలో ఎంతో ఉత్సాహంగా ప్రతి వీధి వెంట ఆయన తిరిగాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్కడ స్థానికులతో పంచుకున్నాడు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపాడు. నేడు (జనవరి 20న) తన పుట్టినరోజును స్వగ్రామంలోనే జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా కుంబరహళ్లిలో కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేసేలా చూడాలని విజయ్‌ని వారు కోరారు. దీంతో ఆయన వెంటనే తన లాయర్లతో సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన 6 మంది ఖైదీలను విడిపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను నటుడు విజయ్ స్వయంగా విడుదల చేపించారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టం. అలాంటి బాధ ఎవరికీ రాకూడదని విజయ్ చెప్పాడు. గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకు దునియా విజయ్ వెళ్లాడు. అక్కడ పలువురు ఖైదీలతో మాట్లాడి వారి కష్టాలు, సంతోషాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది. కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడి నుంచి విడుదల చేపించారు. ప్రస్తుతం వారి స్వస్థలం కుంబరనహళ్లిలోని 6 మంది ఒక కేసులో ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అలాంటిదే. శిక్ష కాలం పూర్తి అయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేదు. దీంతో వారు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్ ద్వారా ఆ డబ్బును చెల్లించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు. సలగ సినిమా ఘనవిజయం తర్వాత దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన స్టార్‌డమ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ భీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు (జనవరి 20న) దునియా విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తన కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని అభిమానులను ఆయన అభ్యర్థించాడు. -
సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?
ఈమె ఓ సినిమాలో నటించి.. అది సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ గ్యారంటీ! అబచ్చా.. ఈమె యాక్ట్ చేస్తే హిట్ కొట్టడం ఏంటి బాసూ.. సినిమాలో దమ్ముండాలి. జనాలకు అది నచ్చాలి కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ గత మూడు-నాలుగేళ్లుగా చూసుకుంటే మాత్రం పండక్కి వచ్చే చిత్రాలకు ఈమె లక్కీ ఛార్మ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె అదృష్టం సంగతేంటి? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సాధారణంగా అలాంటి పొట్టిపొట్టి బట్టల్లో అయితే కనిపించదు. ఎందుకంటే ఈమె హీరోయిన్ కాదు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది గానీ హిట్స్ పడలేదు. దీంతో రూట్ మార్చేసింది. తొలుత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. అవి క్లిక్ అయ్యేసరికి ఇలాంటివే చేస్తూ వచ్చింది. అయితే ఈమెలోని అద్భుతమైన నటిని గుర్తిస్తున్న పలువురు డైరెక్టర్స్.. ఈమెకు డిఫరెంట్ రోల్స్ ఇస్తూ ప్రోత్సాహిస్తున్నారు. (ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్) అలా తెలుగులోనూ గత నాలుగైదేళ్లలో వరలక్ష్మికి మంచి మంచి రోల్స్ పడ్డాయి. 2021 సంక్రాంతికి రవితేజ 'క్రాక్'లో విలన్ భార్యగా నటించింది. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అదరగొట్టేసింది. ఇక గతేడాది పండక్కి వచ్చిన 'వీరసింహారెడ్డి' చిత్రంలోనూ హీరోకి చెల్లెలి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తాజాగా 'హను-మాన్'లోనూ హీరోకి అక్క పాత్రలో ఉన్నది కాసేపే అయినా కేక పుట్టించేసింది. అనుకోకుండా జరిగినా సరే 2021, 2023, 2024లో సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాల్లో ఈమె నటించడంతో వరలక్ష్మిని... పండగ సినిమాల లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. అయితే ఈమె ఉన్నంత మాత్రాన హిట్ అయిపోలేదు. సినిమాలో కంటెంట్‌కి తోడు వరలక్ష్మి యాక్టింగ్ కూడా కలిసొచ్చి ఇప్పుడు ఈమె.. టాలీవుడ్లో స్టార్ యాక్టర్ అయిపోయిందనొచ్చు. (ఇదీ చదవండి: ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్‌బాస్ 7' బ్యూటీ!) -
లుక్ మార్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇలా అయిపోయిందేంటి?
సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది. సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్‌తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్‌పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) #HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z — Trend Soon (@trend_soon) January 6, 2024 -
హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!
హీరోయిన్ హనీరోజ్ పేరు చెప్పగానే కుర్రాళ్లు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె గ్లామర్, ఒంపుసొంపులు అలాంటివి మరి. 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనే గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఓ రిస్కీ పనిచేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన హనీరోజ్.. కెరీర్ స్టార్టింగ్ లో 'ఆలయం' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014లో వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షిగా' మూవీలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ రెండుసార్లు లక్ కలిసిరాలేదు. ముచ్చటగా మూడోసారి తెలుగులో చేసిన సినిమాతో ఈమెకి హిట్ దక్కింది. ఇందులో అందాల ఆరబోతతో రెచ్చిపోయినప్పటికీ కొత్తగా సినిమాల్లో ఛాన్సులయితే రాలేదు. సినిమా కెరీర్ గురించి పక్కనబెడితే ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ కి వెళ్లిన హనీరోజ్.. ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే రాయి)ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా చాలా ఎత్తులో పడుకుని.. తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది. ఈ ఎక్స్ పీరియెన్స్ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని హనీరోజ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement