breaking news
Varsha Deshpande
-
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే. -
బాంబే హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్
తనపై దాఖలైన పిటీషన్‌ను కొట్టివేయాలంటూ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. షారుక్ తన మూడో బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక ఉద్యమకర్త వర్షా దేశ్‌పాండే కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో షారుక్‌తో పాటు ఆయన భార్య గౌరి, జస్లోక్ ఆస్పత్రి, అందులో పనిచేసే వైద్యుడు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా ఈ కేసు స్థానికి మేజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల విచారణకు వచ్చినపుడు దేశ్‌పాండే కానీ ఆమె తరపు న్యాయవాది కానీ హాజరు కాలేదని షారుక్ న్యాయవాది ప్రణవ్ బండేకర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇంతకుముందు విచారణ నిర్వహించారని తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. కావున ఈ పిటీషన్‌ను తోసిపుచ్చాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న అనంతరం ఈ నెల 30లోగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.


