breaking news
Vangapally
-
వంగపల్లిలో నిలిచిపోయిన గూడ్సు రైలు
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే గేటు మధ్యలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గూడ్సు రైలు ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల రైలు ఆగిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. రైలు సరిగ్గా రోడ్డు మార్గానికి అడ్డంగా ఆగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
యాదగిరిగుట్ట (నల్లగొండ) : హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి గురువారం నల్లగొండ జిల్లా వంగపల్లి వద్ద నిలిచిపోవడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీని వల్ల వరంగల్ జిల్లా జనగామలో గోల్కొండ రైలును గంటన్నరసేపు నిలిపివేశారు. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్పుల్ రైలును వరంగల్ వరకు కాకుండా.. ఖాజీపేట వరకే కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.