breaking news
Uttar pradesh cricket association
-
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే
భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా! -
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా సంచలన నిర్ణయం
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్ ఇనాగురల్ సీజన్లో రాణా నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. Onto the next chapter. https://t.co/Zz1VyZKysA — Nitish Rana (@NitishRana_27) August 20, 2023 టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్ చేశాడు. ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ అని క్యాప్షన్ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్, నాన్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
విండీస్ ‘ఎక్స్ట్రా’ ప్రాక్టీస్
కోల్‌కతా: భారత్‌తో సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నెట్ సెషన్లకే పరిమితమైన ఆటగాళ్లందరూ బుధవారం పూర్తిస్థాయిలో కసరత్తులు చేశారు. ఉదయం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానం చిత్తడిగా ఉండటంతో అక్కడికి దగ్గర్లో ఉన్న గంగూలీ అకాడమీలో ప్రాక్టీస్ చేశారు. మధ్యాహ్నం మళ్లీ స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు దాదాపు రెండున్నర గంటలపాటు చెమటోడ్చారు. బౌలర్లు పేస్ బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టి నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. 150వ టెస్టు ఆడుతున్న సీనియర్ ఆటగాడు చందర్‌పాల్ ‘ఎక్స్ట్రా’ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మైదానం వెలుపల ఉన్న నెట్స్‌లో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ గడిపాడు. నేటి నుంచి యూపీసీఏతో ప్రాక్టీస్ మ్యాచ్ భారత్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌కు ఒకే ఒక్క సన్నాహాక మ్యాచ్‌ను కేటాయించారు. అందులో భాగంగా నేటి నుంచి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.


