breaking news
An unknown person
-
గుర్తు తెలియని వ్యక్తి హత్య
గుర్తుతెలియన వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం చినతాడేపల్లి రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. బుధవారం ఉదయం చినతాడేపల్లిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో నూజెండ్ల మండలంలోని కొండలరాయునిపాలెం- పువ్వాడ గ్రామాల మధ్య ఉన్న గుండ్లకమ్మ నదిలో గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ్‌చరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మొండెం మాత్రమే ఉంది. కాళ్లు, చేతులు నరికేసి ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.