breaking news
Unique control system
-
అద్వితీయ క్షిపణిని పరీక్షించిన రష్యా
మాస్కో: అపరిమితమైన దూరంలోని లక్ష్యాన్ని సైతం చేధించే అద్వితీయ క్షిపణి ‘బురేవేస్ట్నిక్’ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. అణుఇంజిన్ అందించే అసాధారణ శక్తితో ఇది గంటల తరబడి గాల్లో ప్రయాణించగలదు. ఆదివారంనాటి పరీక్షలో ఇది ఏకధాటిగా 15 గంటలపాటు గాల్లోనే దూసుకెళ్లిందని దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పుతిన్ ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో వర్చువల్ భేటీలో పుతిన్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం. తక్కువ ఎత్తులో అపరిమిత దూరాలకు ప్రయాణించే ఈ క్షిపణిని తయారుచేయబోతున్నట్లు 2018లో రష్యా తొలిసారిగా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి సమర్థతపై పశ్చిమదేశాలు అనుమానం వ్యక్తంచేశాయి. రెండేళ్ల క్రితమే పూర్తిస్థాయి క్షిపణిని తయారుచేశామని పుతిన్ చెప్పారు. అయితే 2016 ఏడాది నుంచి ఇప్పటిదాకా 13 సార్లు ఈ క్షిపణిని పరీక్షించగా రెండుసార్లు మాత్రమే పాక్షికస్థాయిలో లక్ష్యాన్ని చేధించిందని ఒక నిరాయు«దీకరణ ఉద్యమ సంస్థ పేర్కొంది. న్యూక్లియర్ ప్రొపల్షన్ యూనిట్‌ను తయారుచేయడం చాలా కష్టమైన వ్యవహారమని ఇంటర్నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ సంస్థ అభిప్రాయపడింది. అయితే తమ క్షిపణి 10వేల నుంచి 20వేల కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఆర్మీ చెబుతోంది. భూమి నుంచి కేవలం 50 లేదా 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండటం కారణంగా ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ఈ మిస్సైల్ రాకను గుర్తించలేవు. గాల్లో ఘన ఇంధన రాకెట్ బూస్టర్ల సాయంతో ప్రయోగించాక ఇది ప్రయాణాన్ని అణు ఇంజిన్‌తో కొనసాగిస్తుందని నాటో వర్గాలు అంచనావేస్తున్నాయి. దీనికి స్కైఫాల్ అని పేరుపెట్టుకున్నాయి. ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించిన జాయింట్ స్టాఫ్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ కేంద్రాన్ని సా యుధ బలగాల సుప్రీం కమాండర్ హోదాలో పుతిన్ పుతిన్ ఆదివారం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. చీఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వలేరీ గెరసిమోవ్ సారథ్యంలోని కమాండర్లతో పుతిన్ భేటీ అయ్యారు. కీలకమైన మార్గాల్లో 10,000 మందికిపైగా ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని వలేరీ పుతిన్‌కు వివరించారు. ఏకంగా 31 బెటాలియన్ల ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని తెలిపారు. -
అడ్డగోలు స్టడీ సెంటర్లపై కొరడా
- ఇతర రాష్ట్రాల వర్సిటీ విద్యా సంస్థలపై చర్యలు - ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల అనుబంధ సంస్థల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న స్టడీ సెంటర్లపై కఠిన చర్యలకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. అడ్డగోలుగా విద్యా వ్యాపారం చేస్తున్న ఇలాంటి వాటిపై కొరడా ఝుళిపించేందుకు ఉపక్రమిస్తోంది. బీఎస్సీ అగ్రికల్చర్‌తోపాటు వివిధ కోర్సులను ‘ఆఫ్ క్యాంపస్’ విధానంలో స్టడీ సెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఈ తరహా స్టడీ సెంటర్లపై నివేదిక రూపొందించింది. ప్రభుత్వం దృష్టికి... యూజీసీ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్ల పేరుతో మరో రాష్ట్రంలో కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. సదరు వర్సిటీలోనే చదివినట్టు సర్టిఫికెట్లు కూడా జారీ చేయకూడదు. విద్యా శాఖ దీనిపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేయడంతో పాటు, యూజీసీకి లేఖ రాసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మూడు వర్సిటీలవిగా చెప్పుకొంటున్న స్టడీ సెంటర్లు... తెలంగాణలో బీఎస్సీ అగ్రికల్చర్, ఇతర కోర్సులను నిర్వహిస్తున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్‌ను విశ్వవిద్యాలయంలోనే అందించాలి. లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం గానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆమోదంతో గానీ నిర్వహించాలి. అందుకు అనువైన వ్యవసాయ క్షేత్రాలు ఉండాలి. ఇవేవీ లేకుండానే తెలంగాణలో స్టడీ సెంటర్లు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తూ సర్టిఫికెట్లు అందజేసే కేంద్రాలుగా మారిపోయాయి. అయితే వీటిపై ఉన్నత విద్యా శాఖ గానీ, ఉన్నత విద్యా మండలి గానీ నేరుగా చర్యలు చేపట్టే వీలులేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను తెస్తేనే బాగుంటుందని భావించిన ఉన్నత విద్యా మండలి, వ్యవసాయ వర్సిటీలు... దీనిపై పలు దఫాలుగా చర్చించి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. వీలైతే ఈనెల 14న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటును కోరాలనే ఆలోచనలో ఉన్నాయి.


