breaking news
TSPSC employees
-
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
‘వయస్సు’మీరింది!
సాక్షి, హైదరాబాద్:నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ముగియడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యంతో 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి దాటి అనర్హులుగా మారిన నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పొడిగిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 44 ఏళ్లకు వయోపరిమితి పెరగడంతో వేలాది మందికి ప్రయోజనం కలిగింది. తొలుత ఏడాది అమలు గడువుతో ఈ ఉత్తర్వులను జారీ చేయగా, నాలుగేళ్లుగా గడువును పొడిగిస్తూ వస్తున్నారు. చివరిసారి జారీ చేసిన జీవో అమలు గడువు గత జూలై 27తో ముగిసింది. మళ్లీ జీవో అమలు గడువును పొడిగిస్తూ కొత్త జీవో జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 3,025 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు టీఎస్పీఎస్సీ నుంచి నియామక ప్రకటనలు వస్తున్నాయి.వీటితో పాటు భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని నిరుద్యోగులు మదనపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సుల మేరకు గతంలో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని, ఈ ఉత్తర్వుల అమలు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
టీఎస్పీఎస్సీ ఉద్యోగుల ధర్నా
- తెలంగాణ రికార్డులు ఇవ్వాలని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిరసన హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉద్యోగులు గురువారం ధర్నాకు దిగారు. తెలంగాణ జిల్లాలకు చెందిన పాత రికార్డులు, ఫైళ్లు ఇతర సమాచారాన్ని తమకివ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఏపీపీఎస్సీ పరిపాలన గదికి కొద్దిసేపు తాళం వేసి కార్యకలాపాలను అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ ఏర్పడినా రికార్డులు ఇవ్వకుండా తమ కార్యకలాపాలు కొనసాగకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీకి బదిలీ అయిన ఉద్యోగుల దగ్గరి ఏపీ రికార్డులను ఏపీపీఎస్సీ అధికారులు తీసుకుని, తెలంగాణ రికార్డులను ఇవ్వడం లేదన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే ఇరు కమిషన్ల కార్యదర్శులు దీనిపై చర్చించారు. రెండు మూడు రోజుల్లో రికార్డులను ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ అంగీకరించిందని చెప్పడంతో ఆందోళన విరమించారు.