breaking news
Transformer power
-
దారుణం: భార్యతో గొడవపడి.. ట్రాన్స్ఫార్మర్ ఎక్కి..
సైదాబాద్: మద్యం మత్తులో ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అక్బర్‌బాగ్‌లోని ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేసే అక్బర్ (40) మొదటి భార్య అజ్మరీతో కలిసి ఉంటున్నాడు. నిత్యం మద్యం తాగి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను భార్యతో గొడవపడ్డాడు. అదే కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చి దిల్కుష్ ఫంక్షన్‌హాల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. కింద ఉన్నవారు వారిస్తున్నా వినకుండా అక్కడి విద్యుత్ వైర్లను తాకాడు. దాంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌తో అతను అంత ఎత్తు నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి పడిపోయాడు. తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసమయంలో ఆ రహదారిపై వెళుతున్న వారు తీసిన అతని ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A man ended his life by touching the live wire atop of a eletrical transformer at Akbarbagh Saidabad pic.twitter.com/DqDTXKBqBk — S.M. Bilal (@Bilaljourno) May 31, 2021 చదవండి: Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..! -
వాన బీభత్సం
లింగంపేట, న్యూస్‌లైన్ : మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, మాల పాటి, లొంకల్‌పల్లి, సజ్జన్పల్లి, ఎక్కపల్లి, ఎక్కపల్లితండా, పర్మల్ల తదితర గ్రామాలలో 20 విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. సుమా రు 150 చెట్లు నేల కూలిపోయా యి. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల బాల్‌రాజ్, మార్గం స్వరూప, మార్గం లచ్చవ్వ, బైండ్ల శివకుమార్, బైండ్ల పోచయ్య తది తరులకు చెందిన రేకుల షెడ్లు సు మారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సుమారు 20 ఇళ్ల కూన పెంకులు గాలికి ఎగిరి పోయాయి. శెట్పల్లి సంగారెడ్డిలో 15 నివాస గుడిసెలు, ఇండ్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. శెట్పల్లి సంగారెడ్డి పంచాయతీ పరిధిలోని మాలపాటి గ్రామంలో రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఈదురు గాలులకు ధ్వంస మయ్యాయి. కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి పోయాయి. రైతులు జనరేటర్‌ను ఉపయోగించి వర్షం నీటిని తొలగించారు. బలమైన ఈదురు గాలుల తాకిడికి రేకుల షెడ్లు కొట్టుకు పోయాయి. అకాల వర్షం వల్ల సుమారు రూ. 70 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోరు వర్షం కురియడంతో జనజీవనం అతలాకుతలమైంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తిర్మలాపూర్‌లో.. బాన్సువాడరూరల్ : బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని మొగులాన్పల్లి, కొత్తాబాది, తిర్మలాపూర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మొగులాన్ పల్లి గ్రామం, తండాల్లో షెడ్లపై నుంచి రేకులు ఎగిరిపోగ, ఇళ్లపై కూనలు పగిలిపోయాయి. కొత్తాబాది బస్టాండ్ సమీపంలో విద్యుత్ స్తంభం విరిగింది. తిర్మలపూర్లో పంట పొలాల్లో ఇనుప విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. తిర్మలాపూర్ గేట్ వద్ద తాగునీటి లైన్ స్తంభం విరిపోయింది. గ్రామం అంధాకారమయమైంది. ఆరుబయట వున్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తూకం వేసిన సంచులు తడిసి పోవడంతో రైతులు ధాన్యాన్ని వేరేసంచుల్లోకి మార్చారు. గ్రామసర్పంచ్ బేగరిసాయిలు, వార్డుసభ్యుడు సద్దాం గ్రామంలో జరిగిన నష్టాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పిట్లంలో.. నిజాంసాగర్ : పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ఇళ్లకు చెందిన రేకులు కొట్టుక పోయాయి. ఇళ్ల రేకులు ఎగిరి పోవడంతో భయాందోళనకు గురైనట్లు గ్రామానికి చెందిన నుప్పల అంజయ్య తెలిపారు.