breaking news
total solar eclipse
-
నేడు సంపూర్ణ సూర్యగ్రహం.. 2 నిమిషాలు పట్టపగలే చీకటి!
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి బాహ్య వాతావరణమైన ‘కరోనా’ స్పష్టంగా కనిపించనుంది. అయితే ఆకాశంలో అద్భుతం జరుగుతున్నా.. భారత్ మాత్రం ఈసారి సూర్యుడి ‘మాయ’ను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కోల్పోనుంది.భారత కాలమానం ప్రకారం.. పాక్షిక గ్రహణం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. రాత్రి 11.16–11.17 గంటల సమయంలో గరిష్ఠ దశకు చేరుకుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున సంపూర్ణ దశ ముగుస్తుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గ్రహణం పూర్తిగా వీడిపోతుంది. జ్యోతిష విశ్వాసాలు.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం?జ్యోతిష సంప్రదాయాల ప్రకారం.. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణంగా సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో నివసించే ఆశ్లేషా నక్షత్రజాతకులు, కర్కాటక రాశివారు గ్రహణ శాంతి, జపం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష పండితులు సూచిస్తారు. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి.. ఇక్కడ నివసించే వారికి ప్రత్యేక గ్రహణ శాంతులు అవసరం లేదని సంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే..జ్యోతిష విశ్వాసాల ప్రకారం కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశులపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చని, వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతారు. మిగిలిన రాశులైన మిథున, వృశ్చిక, మకర, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని పేర్కొంటారు. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమేనని, వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి ఆధారంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్ర జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.2034 వరకు భారత్‌కు ఎదురుచూపులే!ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారత్‌లో సూర్యుడు అస్తమించి ఉంటాడు. దీంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచీ ఈ గ్రహణాన్ని చూడలేం. భారత్ నుంచి తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే. 2034 మార్చి 20న భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది. అంతవరకు భారతీయ ఖగోళ అభిమానులు ఈసారి గ్రహణాన్ని అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది. అంటే 27 ఏళ్ల తర్వాత యూరప్‌కు అరుదైన అవకాశంఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్‌కు ప్రత్యేకమైనది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. సుమారు 98 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పాక్షిక గ్రహణాన్ని చూడగల అవకాశం ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ గ్రహణ మార్గంలో ఉండి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఎక్కడ కనిపించనుంది?సంపూర్ణ గ్రహణ మార్గం ఉత్తర ప్రాంతాల నుంచి ప్రారంభమై యూరప్ వైపు సాగుతుంది. ప్రధానంగా.. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించే అవకాశం పొందనున్నాయి. స్పెయిన్‌లోని లియోన్, వల్లడోలిడ్, జరగోజా, టెరుయెల్, వాలెన్సియా వంటి నగరాలు గ్రహణాన్ని చూసేందుకు అత్యుత్తమ ప్రాంతాలుగా నిలవనున్నాయి. మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో సూర్యుడిలో 99 శాతానికి పైగా భాగం కప్పుకున్నా.. సంపూర్ణ గ్రహణం మాత్రం కనిపించదు.రెండు నిమిషాలకు పైగా పగలే చీకటిసంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడి ముఖాన్ని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ దశ గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్ల వరకు కొనసాగనుంది.ఈ సమయంలో..సూర్యుడి కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ప్రకాశవంతమైన నక్షత్రాలు, గ్రహాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలకు కీలక సమయం.సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకాంతిని అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమిపై పడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పితే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే కప్పితే అది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది.గ్రహణాన్ని చూసేవారు జాగ్రత్త!గ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ✅ ప్రత్యేక సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ మాత్రమే ఉపయోగించాలి.❌ సాధారణ సన్‌గ్లాసెస్‌తో సూర్యుడిని చూడకూడదు.❌ టెలిస్కోప్, బైనాక్యులర్, కెమెరా, సెల్‌ఫోన్ కెమెరాలతో నేరుగా చూడటం ప్రమాదకరం. సరైన రక్షణ లేకుండా గ్రహణ సమయంలో సూర్యుడిని చూడటం కంటి చూపుకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. -
సంపూర్ణ గ్రహణాన్ని మనం చూడలేమా?
న్యూఢిల్లీ: పట్టపగలే కారుకున్న కమ్ము చీకట్లు.. కీచురాళ్ల సందడితో వందేళ్లకోకసారి వచ్చే సంపూర్ణ సూర్య గ్రహణాన్ని అమెరికా ప్రజలు వీక్షించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కళ్లజోడు సాయం లేకుండా నేరుగానే తిలకించారు. అదే సమయంలో భారత ప్రజలు మాత్రం డిజిటల్ దర్శనం(టీవీలు, సోషల్ మీడియాలో) సరిపెట్టుకున్నారు. అయితే ఇలాంటి సంపూర్ణ గ్రహాణాన్ని వీక్షించాలంటే భారతీయులు మాత్రం కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రెండు మూడేళ్లకోకసారి ఇలాంటి సంపూర్ణ గ్రహణాలు సంభవిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్ లేదా అంటార్కిటికా ప్రాంతాల్లో అయితే ఏడాదికొకసారి కూడా వస్తుంటాయి. కానీ, ప్రస్తుతం చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉన్న కారణంగా రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం పూర్తి స్థాయి గ్రహణంను వీక్షించే ఆస్కారం ఏ మాత్రం లేదని వారంటున్నారు. 2019, 2020లో గ్రహణాలు ఉన్నప్పటికీ , 2034లో రాబోయే గ్రహణం మాత్రమే పూర్తిగా దేశం మొత్తం వీక్షించే అవకాశం ఉందని తేల్చేశారు. డిసెంబర్ 26, 2019లో గ్రహణం దక్షిణ భారత దేశంతోపాటు శ్రీలంక, మలేషియా, సుమట్ర తోపాటు బోర్నియో, గువాం ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించనుంది. జూన్ 21, 2019లో సంభవించే గ్రహణం కేవలం ఢిల్లీతోపాటు ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీక్షించే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆ లెక్కన సంపూర్ణ గ్రహణం వీక్షించాలంటే మాత్రం మరో 17 ఏళ్లు ఓపికపట్టాల్సిందే. -
ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత
న్యూఢిల్లీ: ఆగస్టు21న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. అమెరికాఖండంలోని 14 రాష్ట్రాల్లో ఏర్పడనుందని నాసా ప్రకటించింది. 2017 ఆగస్టు 21 న సంభవించే ఇది చాలా అరుదైన గ్రహణమనీ, ఖగోళ అద్భుతం మని నాసా అభివర్ణించింది. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాలలో ఇది మొదటిదని పేర్కొంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్యనుంచి చంద్రుడు దాటుడూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో ఆకాశంలో సూర్యుడు కనిపించడని పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ ఈవెంట్‌ను దాదాపు 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నారని నాసా అంచనా వేసింది. అలాగే ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రా ప్రమాణాలను పాటించాలని నాసా సిఫారసు చేసింది. ముఖ్యంగా ఎక్లిప్ గ్లాసెస్ లేదా హ్యాండ్ హెల్డ్ సోలార్ వ్యూయర్ లాంటి ప్రత్యేక ప్రయోజన సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. మరోవైపు ఈ గ్రహణం కారణంగా ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్లాండ్ నుంచి ఓరెగాన్ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది. రెండు నిమిషాల కొన్నిసెకన్లపాటు ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తాయట. కాగా 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్ 8వ తేదీన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. -
ఆ రోజు సూర్యుడు పూర్తిగా ఉదయించడు!
న్యూఢిల్లీ: మీరు.. రోజూ సూర్యుడి కంటే ముందే నిద్రలేచి, మార్నింగ్ వాక్ చేస్తూ సన్‌రైజ్‌ను ఎంజాయ్ చేస్తారా? లేక పొద్దుపోయిందాకా పనిచేసి బారెడు పొద్దెక్కాకగానీ లేవరా? ఏ కేటగిరీకి చెందినా.. మార్చి 9న మాత్రం సూర్యోదయాన్ని అస్సలు మిస్ కాకండి. బుధవారం తూర్పున ఓ అద్భుతం కనిపించబోతోంది. రోజూలా పూర్తిగా కాకుండా.. పాక్షికంగా ఉదయించే సూర్యుడ్ని చూడబోతున్నారు మీరు! అవును. మార్చి 9న సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణం తెలుగు నేలపై నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు. కాకుంటే పొద్దున్నే నిద్రలేవాలంతే! తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 10 గంటల 5 నిమిషాలకు పూర్తవుతుందని, పశ్చిమ, వాయవ్యరాష్ట్రాల్లో తప్ప భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో సూర్యగ్రహణాన్ని చూడొచ్చని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రహణానికి సంబంధించిన మరి కొన్ని ముఖ్యాంశాలివి.. - ఉదయం 4:49కి గ్రహణం ప్రారంభం అవుతుంది. - 5:47కు సూర్యుడు పూర్తిగా కనుమరుగవుతాడు. - 9:08 గంటల వరకు.. అంటే 3 గంటల 61 నిమిషాలపాటు కనిపించడు. - స్థానిక కాలమానం ప్రకారం ఈ వ్యవధి ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతుంది. - హైదరాబాద్‌లో ఉదయం 6:29 నుంచి 6:47 వరకు.. అంటే 18 నిమిషాలపాటు సూర్యగ్రహణాన్ని వీక్షించొచ్చు. - నల్లగొండ జిల్లాలో 6:26 నుంచి 6:47వరకు (21 నిమిషాల పాటు) గ్రహణం కనిపిస్తుంది. - కేంద్రపాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్‌లో 49 శాతం, భువనేశ్వర్ లో 24.5 శాతం, అగర్తలాలో 15, గువాహటిలో 11, కోల్‌కతాలో 18.5 శాతం గ్రహణం కనిపిస్తుంది. - భారత్‌తోపాటు ఆగ్నేయ ఆసియా దేశాలైన థాయిలాండ్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్ లలోనే కాక ఆస్ట్రేలియా, ఉత్తర ఫసిఫిక్ సముద్రప్రాంతంలోనూ గ్రహణం ఏర్పడుతుందని ఎర్త్ సైన్సెస్ శాఖ తెలిపింది. - ఉదయమే ఏర్పడినా.. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెల్డింగ్ గ్లాస్, బ్లాక్ పాలిమర్, మైలార్ తదితర సాధనాల ద్వారా మాత్రమే సూర్యగ్రహణాన్ని దర్శించాలంటున్నారు. - సూర్యగ్రహణం నేపథ్యంలో మార్చి 9న దేశంలోని ప్రధాన ఆలయాలన్నింటిని మూసివేసి, గ్రహణీ వీడిన తర్వాత సంప్రోక్షణ నిర్వహిస్తారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గ్రహణ కాలం ఇలా ఉంటుంది చెన్నై: ఉదయం 6:21 నుంచి 6:47 వరకు ఢిల్లీ: 6:38 నుంచి 6:44 కన్యాకుమారి: 6:30 నుంచి 6:46 కోల్ కతా: 5:51 నుంచి 6:05 లక్నో: 6:23 నుంచి 6:45 మంగుళూరు: 6:43 నుంచి 6:47 మైసూర్: 6:35 నుంచి 6:47 వారణాశి: 6:13 నుంచి 6:47 వరకు సూర్యగ్రహణం కనిపిస్తుంది. -
మార్చి 9న ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: మార్చి 9న ఆకాశంలో అద్భుతం జరగనుంది. రోజూ తెల్లవారగానే అరుణ వర్ణంలో శోభించే సూర్యుడిని చూస్తాం. కానీ మార్చి 9న మాత్రం పాక్షికంగా ఉదయించే సూర్యుడిని గమనించొచ్చు. తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణాన్ని భారత దేశంలోని వాయువ్య రాష్ట్రాల వారు తప్ప అందరూ చూడొచ్చని ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే బుధవారం ఉదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం కనబడుతుంది. హైదరాబాద్‌లో ఉదయం 6.29 నుంచి 6.47 వరకు 18 నిమిషాలపాటు, నల్లగొండ జిల్లాలో 6.26 నుంచి 6.47 వరకు 21 నిమిషాల పాటు, చెన్నైలో ఉదయం 6.21 నుంచి 6.47 వరకు, ఢిల్లీలో 6.38 నుంచి 6.44 వరకు, కోల్‌కతాలో 5.51 నుంచి 6.05 వరకు గ్రహణాన్ని వీక్షించొచ్చు. భారత్‌తోపాటు థాయ్‌లాండ్, ఇండొనేషియా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఉత్తర పసిఫిక్ సముద్రప్రాంతంలో ఈ గ్రహణం కనబడుతుంది. గ్రహణం ఉదయమే సంభవిస్తున్నా.. నేరుగా చూస్తే కళ్లకు ప్రమాదం.


