breaking news
Times list
-
ఆమె ‘టైమ్’ మొదలైంది!
ఒక జవాబు ఏం చేస్తుందో తెలియదుకానీ...ఒక ప్రశ్న మాత్రం చాలా చేస్తుంది! ఆ ప్రశ్న ఆమెను కొత్తగా ఆలోచించేలా, కొత్త ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చేలా చేసింది. ఆ ఆవిష్కరణే అనీమా ఆనంద్‌కుమార్‌ను టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పీపుల్ ఇన్ ఏఐ’ జాబితాలో చోటు సాధించేలా చేసింది...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాసాలు రాయగలదు. ప్రశ్నలకు జవాబులు చెప్పగలదు. ఇన్ని చేసే కృత్రిమ మేధస్సు... భౌతిక ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలదా? సెమీకండక్టర్ తయారీని మెరుగుపరచగలదా? ఇప్పుడున్న సాంకేతిక పద్ధతుల కంటే అసాధారణ వాతావరణాన్ని మెరుపు వేగంతో పసిగట్టగలదా?... ఈ ప్రశ్నలు అనీమా ఆనంద్ కుమార్‌ను లోతుగా ఆలోచించేలా చేశాయి. ప్రమాద నష్టాలను తగ్గించే సాంకేతికతపై కాకుండా ప్రమాదాలను ముందుగా పసిగట్టే సాంకేతికతపై దృష్టి పెట్టారు అనీమ. దాని ఫలితమే... యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ అనే సంస్థ.మరో ముందడుగుఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్ అయిన అనిమా ఆనంద్ కుమార్, బెనెడిక్ట్ జెనిక్తో కలిసి ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ ఇంక్’ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి ఏఐ దిగ్గజాలను ఎదుర్కోవడానికి, వాటికి దీటుగా ఏఐ చాట్బాట్లు, మోడల్స్‌ని నిర్మించడానికి ఎన్నో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్’ సంస్థ చేరింది.‘ఇది ఏఐ ప్రపంచంలో మరో ముందడుగు’ అని అంటున్నారు విశ్లేషకులు. అనిమ రూ΄÷ందించిన అల్గారిథమ్, వాతావరణ సూచన, వైద్యపరికరాల డిజైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ తయారీ, న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్‌కు ఉపయోగపడుతుంది.పిన్న వయసులోనే ప్రొఫెసర్కర్నాటకలోని మైసూర్లో జన్మించిన అనీమ ఐఐటీ, మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కార్నెల్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందు యూసీ ఇర్వీన్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాల్టెక్ యూనివర్శిటీలో అత్యంత పిన్నవయస్కురాలైన ప్రొఫెసర్‌గా గుర్తింపు ΄÷ందారు. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా, ‘ఎన్విడియ’లో ఏఐ రిసెర్చ్‌కు సంబంధించి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.ప్రత్యేకత ఇది...‘యాక్సిలరేటెడ్ అండర్ స్టాండింగ్ ఇంక్’ అనేది న్యూరల్ ఆపరేటర్స్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఫిజికల్ సిస్టమ్స్ నుండి నేర్చుకున్నదాన్ని వివిధ సమస్యల పరిష్కారానికి ఏఐ సిస్టమ్స్‌ను ఉపయోగించుకుంటుంది. తమ సిస్టమ్ సింగిల్ ప్రాంప్ట్‌లో 5 ట్రిలియన్ల డేటా పాయింట్స్‌ను ప్రాసెస్ చేయగలదని కంపెనీ తెలియజేసింది.టైమ్ ప్రశంస‘వాతావరణాన్ని ఏఐ నియంత్రించలేకపోవచ్చు. కానీ దానిని అంచనా వేయగలదు. ఈ కాలెక్ట్ ప్రొఫెసర్ (అనీమ) అత్యంత వేగంగా వాతావరణాన్ని అంచనా వేసే పద్ధతులకు మార్గదర్శకత్వం వహించారు. సంప్రదాయ విధానాల కంటే వేల రేట్లు వేగంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి అల్గారిథమ్‌లను రూ΄÷ందించారు. క్వాంటం కంప్యూటర్లు, నూతన వైద్యపరికరాలు రూ΄÷ందించడానికి, కంప్యూటర్ చిప్ తయారీలో కీలక దశను ఆప్టిమైజ్ చేయడానికి...ఇంకా మరెన్నో పనులకు అల్గారిథమ్‌లను ఉపయోగించారు’ అని అనీమా ఆనంద్‌కుమార్‌ను పరిచయం చేసి, ప్రశంసించింది టైమ్ మ్యాగజైన్. ఐక్యరాజ్య సమితిలో అనీమఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి శాస్త్రీయ సలహా మండలిలో సభ్యురాలిగా అనీమా ఆనంద్ కుమార్ నియామకం అయ్యారు. తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి శాస్త్రీయ ఎజెండాను రూ΄÷ందించడంలో సహాయం అందించారు అనీమ. ఏఐ సాంకేతికత గురించి తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై ప్రచారం చేశారు. -
టైమ్స్ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు
ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఈ సమయంలో ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. ఇదీ చదవండి: గూగుల్‌లో రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: ముగ్గురు కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
టైమ్స్ జాబితాలో రాజన్, ప్రియాంక
జాబితాలో 9 మంది భారతీయులు న్యూయార్క్: టైమ్స్ పత్రిక ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలురు’ జాబితాలో 9 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లు, పర్యావరణ వేత్త సునీత నరైన్, భారత సంతతి నటుడు అజీజ్ అన్సారీ, లాస్ట్ మైల్ హెల్త్ సంస్థ సీఈవో రాజ్ పంజాబీలు జాబితాలో ఉన్నారు. వార్షిక జాబితాను టైమ్స్ గురువారం విడుదల చేసింది. ముందుచూపు ఉన్న భారత్ బ్యాంకర్‌గా రాజన్‌ను టైమ్స్ కొనియాడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోను భారత్‌ను సమర్ధంగా ముందుకు నడిపించారని, 2003-06 మధ్య ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నప్పుడు ‘సబ్‌ప్రైం’ సంక్షోభాన్ని ముందుగానే ఊహించారని పేర్కొంది. జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అధ్యక్షులు బరాక్ ఒబామా, పుతిన్, ఫ్రాంకోయిస్ హోలాండే, మయన్మార్ మంత్రి ఆంగ్‌సాన్ సూచీ, హిల్లరీ క్లింటన్, ఐఎంఎఫ్ అధినేత క్రిస్టీన్ లాగార్డేలున్నారు. పోటీ పడ్డ వారిలో ప్రధాని మోదీ ఉన్నా.. తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.


