Thalassemia victims
-
తలసేమియాపై ఖమ్మంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
ఖమ్మం, : ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా, తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ (TSCS) ఖమ్మంలో అవగాహన మరియు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 15 మంది పిల్లలకు వారి ధైర్యం మరియు విజయాలకు గుర్తింపుగా ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. అలాగే, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల సమన్వయకర్తలందరినీ వారి అంకితభావ సేవలను గుర్తించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రఘురామ రెడ్డి మాట్లాడుతూ... "తలసేమియా బాధితులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ వ్యాధిపై అవగాహన పెంచడం మరియు నిర్మూలన కోసం మేము కృషి చేస్తాము. ఈ సమస్యను పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వద్ద ఈ సమస్యను తప్పకుండా చర్చిస్తాం" అని ఎంపీ తలసేమియా బాధితులకు మద్దతును తెలియజేశారు.టీఎస్ సీఎస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్నవలి కొట్టపల్లి ఆధ్వర్యంలో, TSCS సిబ్బంది ప్రత్యేక సన్మానాలు చేశారు. దీంతో పాటు తలసేమియాతో బాధ పడుతున్న పిల్లలతో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు మరియు ఆసక్తికరమైన కార్యక్రమాలను నిర్వహించారు. ఇవి తలసేమియా బాధిత కుటుంబాలకు సంతోషాన్ని నింపాయి.ఈ కార్యక్రమం గురించి శ్రీమతి రత్నవలి మాట్లాడుతూ... "TSCS తరపున నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తులు, సంస్థలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఖమ్మం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిబద్ధతకు TSCS హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయం చేసి, నిర్వహించిన డాక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ మరియు శ్రీ శివరతన్ గార్లు చురుగ్గా పాల్గొన్నారు. వారి సహకారానికి TSCS తరఫున ధన్యవాదాలు." అని పేర్కొన్నారు. -
నేనున్నా.. తలసేమియా రోగులకు సీఎం జగన్ భరోసా
సాక్షి, అనకాపల్లి: ‘అన్నా.. మా ఇద్దరు పిల్లలూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తోంది.. మీరే ఆదుకోవాలన్నా..’ అని సీఎం వైఎస్ జగన్‌కు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విసన్నపేటకు చెందిన తలసేమియా రోగులు లోకే‹Ù(13), గుణసాగర్ (11)లతో కలిసి వారి తల్లి నడిశెట్టి లక్ష్మి గోడు వెళ్లబోసుకుంది. పరవాడలో యుజియా ఫార్మా సంస్థ ప్రారం¿ోత్సవం అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాధితులు కలుసుకున్నారు. వారి సమస్యను విని సీఎం వారిలో మనోధైర్యం నింపారు. నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున సాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్శెట్టిని ఆదేశించారు. కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఇద్దరు పిల్లలకు రూ.లక్ష చొప్పున తక్షణం సాయం అందజేశారు. అంతేకాకుండా ప్రతీ 15 రోజులకోసారి ఉచితంగా డయాలసిస్ చేయాలని డీఎంహెచ్‌వోకు అప్పగించారు. ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆ చిన్నారుల తల్లి కన్నీళ్లపర్యంతమైంది. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
'రక్త' కన్నీరు!
* థలసీమియా చిన్నారుల హాహాకారాలు * రక్త దాతల కోసం ఎదురు చూపులు * థలసీమియా సొసైటీలో 50 యూనిట్లకు పడిపోయిన రక్త నిల్వలు * ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: థలసీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారులు రక్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తనిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వారం రోజులుగా థలసీమియా బాధితులు ప్రాణాలకోసం పోరాడుతున్నారు. వీరిలో మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసుగల చిన్నారులున్నారు. బాధితులకు పదిరోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉండగా 16 రోజులకు కూడా రక్తం దొరకడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ థలసీమియా సికిల్‌సెల్ సొసైటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సొసైటీ పరిధిలో ఇప్పటివరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన థలసీమియా బాధితులు సుమారు 2,500 మంది వరకూ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లుగాక మరో 2,500 మంది వరకూ బాధితులు ఉన్నారని అంచనా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పురాణాహవేలి ప్రాంతంలో ప్రత్యేక రక్తనిధి కేంద్రం నడుస్తోంది. దీనిద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, సేకరించిన రక్తాన్ని శుద్ధిచేసి బాధితులకు ఎక్కించడం చేస్తుంటారు. కానీ రక్త దాతలు కరువవడంతో ఇక్కడ నిల్వలు తీవ్రంగా పడిపోయినట్టు సొసైటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 యూనిట్లనుంచి 50కి పడిపోయిన నిల్వలు థలసీమియా సొసైటీ పరిధిలో నడుస్తున్న రక్తనిధి కేంద్రంలో ఎప్పుడూ 300 యూనిట్ల రక్తం స్టాకు ఉంటుంది. రోజూ 50 యూనిట్ల రక్తం వ్యయమవుతూ ఉంటుంది. అలాంటిది స్టాకు 50 యూనిట్లకు పడిపోవడం, దాతలు సకాలంలో స్పందించకపోవడంతో బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. బాధితులకు సమయానికి రక్తం ఎక్కించకపోతే ఒకవిధంగా మృత్యువుతో పోరాడినట్టే ఉంటుంది. ఆరేళ్లలోపు చిన్నారులకు నెలకు ఒకసారి, తొమ్మిదేళ్లు దాటితే 20 రోజులకు రెండుసార్లు యూనిట్ రక్తం చొప్పున ఎక్కించాలి. థలసీమియా బాధితులకు సెలైన్వాష్ చేసిన రక్తాన్నే ఎక్కించాలి మిగతా రక్తనిధి కేంద్రాల్లోని రక్తం వీరికి ఎక్కించేందుకు వీలుండదు. ఇలాంటి రక్తం థలసీమియా సొసైటీ కేంద్రంలోనే లభిస్తుంది. పైగా 5 రోజులకు మించి నిల్వ ఉన్న రక్తం వీరికి పనికిరాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులు చాలామంది ఇక్కడ రక్తం కొరత ఉండటంతో అక్కడే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. బాధితులకు రక్త దాతలు యువ విద్యార్థులే. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచే రక్తం సేకరిస్తారు. కానీ ప్రస్తుతం అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌లు ఉండటంతో విద్యార్థులు రక్తమివ్వడానికి రావడం లేదు. దీంతో ఒక్కసారిగా థలసీమియా బాధితుల ఇబ్బందులు మొదలయ్యాయి. దాతను నేనే తెచ్చుకోవాల్సి వస్తోంది నాది నల్లగొండ జిల్లా మిర్యాల గూడ. నా కొడుకు వయసు 13 నెలలు. 25 రోజులకోమారు రక్తం ఎక్కించాలి. కానీ దొరకడం లేదు. నేనే దాతను వెతుక్కుని హైదరాబాద్‌కొచ్చి బిడ్డకు రక్తం ఇప్పిస్తున్నా. ఇది తలకు మించిన భారమవుతోంది. - నాగేశ్వరరావు, మిర్యాలగూడ