breaking news
telangana RTC
-
TSRTC: అరచేతిలో ఆర్టీసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లలో ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను తెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులలో ట్రాకింగ్ సేవలను ప్రవేశపెట్టారు. అలాగే శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాక్ సేవలను ప్రవేశపెట్టారు. త్వరలో నగరంలోని అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సేవలు సైతం... ఈ మొబైల్ యాప్‌లో బస్సుల ప్రస్తుత లొకేషన్, సమీప బస్ స్టాప్‌ను వీక్షించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్ సేవలను కూడా అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్ సహాయం కోరవచ్చునని ఎండీ పేర్కొన్నారు. కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. (చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు ) -
‘వజ్ర’ తుక్కవుతోంది
సాక్షి, హైదరాబాద్: వజ్ర .. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆర్టీసీ మినీ ఏసీ బస్సు. ఇలాంటివి సంస్థ వద్ద 100 ఉన్నాయి. కానీ ఇప్పటికే కన్పించకుండా డిపోలకు పరిమితమైన ఈ బస్సులు ఇకపై ప్రయాణి కులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నిటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక.. టోకున అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొదలై.. సిటీ బస్సు కాకుండా దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండుకో లేదా ఎక్కడో ఉండే ఆర్టీసీ పాయింట్ వద్దకో వెళ్లాలి. అంతేకానీ క్యాబ్ లాగా అది మన ఇంటి సమీపంలోకి రాదు. కానీ బస్సు కూడా కాలనీలకు చేరువగా వెళ్లేలా ఆర్టీసీలో ఓ ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘వజ్ర’ పేరుతో 2016–17లో ఆర్టీసీ ఓ మినీ బస్సు కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంద ఏసీ బస్సులను రెండు దశల్లో కొనుగోలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్‌కు నడిచేలా రూట్లు సిద్ధం చేసింది. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక చాలాకాలంగా డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను వీటిల్లో తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం రద్దీగా ఉండే శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు వీటిని వాడాలన్న సూచన కూడా పెండింగులో ఉంది. యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. అప్పుడు వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా ♦ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ♦రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. ♦శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు, యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. ♦కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. -
సంక్రాంతి ఎఫెక్ట్.. ఇప్పటికే 300 బస్సులు ఫుల్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు టీఎస్ ఆర్టీసీ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 300బస్సులు ఫుల్ అయ్యాయన్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేశామని, మొత్తం 5252 బస్సులు సిద్దం చేశామన్నారు. 'ఎంజీబీఎస్ నుండి 3400 బస్సులు తిరుగుతాయి. ఉత్తర తెలంగాణ బస్సులు 10వ తేదీ నుండి 14వరకు జేబీఎస్ నుండి నడుస్తాయి. నల్లగొండ వెళ్లే బస్సులు దిల్‌షుఖ్‌నగర్ నుండి, వరంగల్ వెళ్లే బస్సులు ఉప్పల్ నుండి వెళ్తాయి. కర్నూలు అనంతపురం వెళ్లే రెగ్యులర్ బస్సులు ఎంజీబీఎస్ నుండి, స్పెషల్ బస్సులు సీబీఎస్ నుండి బయలు దేరుతాయి. వికారాబాద్, తిరుపతి, మహబూబ్ నగర్, బెంగుళూరు బస్సులు ఎంజీబీఎస్ నుండి వెళ్తాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సులు నగర శివార్ల నుండే బయలుదేరుతాయి. వెయ్యి బస్సులను ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించాము. ప్రయాణికుల సేవల కోసం 24గంటలూ అధికారులు అందుబాటులో ఉంటారు. స్పెషల్ బస్సులకు స్పెషల్ చార్జీలు ఉంటాయి. 50శాతం అదనంగా చార్జీలు ఉంటాయి. రిజర్వేషన్లలో విశాఖ, అమలాపురం, రాజోలు వంటి ప్రాంతాలకు డిమాండ్ అధికంగా ఉంది. 1592బస్సులను తెలంగాణకు, 3670 బస్సులను ఏపీకి నడపనున్నాము. సిటీ బస్సులను కూడా వినియోగిస్తాం. రోజుకు 400 మెట్రో ఎక్స్ ప్రెస్, లైనర్లు, డిలక్స్ బస్సులను వాడుతాము. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుండి బస్ పాయింట్ల వద్దకు షెటిల్ బస్సులను తిప్పుతాము' అని యాదగిరి పేర్కొన్నారు. -
విన్నపాలు వినవలె..
సర్కారుకు శాఖల ‘బడ్జెట్’ విజ్ఞప్తులు ♦ వెయ్యి కోట్లిచ్చి ఆదుకోండి: ఆర్టీసీ ♦‘డబుల్’కు రూ.20 వేల కోట్లు: గృహ నిర్మాణ శాఖ ♦ రూ.3,800 కోట్లు కావాలి: బీసీ సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. అప్పులు, బకా యిలు, నష్టాల వల్ల జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందిగా ఉన్నందున ఈసారి బడ్జెట్లో రూ.1,064 కోట్లిచ్చి ఆదుకోవాలని ఆర్టీసీ ఎండీ రమణారావు కోరారు. ఈ మేరకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డికి ఇటీవల ఆయన ప్రతిపాదనలు అందజేశారు. ప్రభు త్వం చెల్లించాల్సిన రూ.590 కోట్ల బస్సు పాసుల రాయితీ మొత్తం, ప్రభుత్వ పూచీతో తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించిన రూ.334.72 కోట్లతో పాటు కొత్త బస్సుల కొనుగోలుకు రూ.140 కోట్లు చెల్లించాలని వాటిలో కోరారు. డబుల్ బెడ్రూమ్లకు రూ.20 వేల కోట్లు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు అవసరమవుతా యని గృహనిర్మాణ శాఖ నిర్ధారించింది. ఇందుకు బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని, హడ్కో నుంచి రూ.17 వేల కోట్లు రుణం తీసుకో వాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇతర విభాగాల ఇళ్లకుమరో రూ.2 వేల కోట్లు కలిపి మొత్తం రూ.5 వేల కోట్లు కోరారు. ఇక, బలహీన వర్గాల కాలనీల్లో ఈసారి భారీగా రామాలయాల నిర్మాణం చేపట్టనున్నందున సర్వశ్రేయో నిధికి రూ.100 కోట్లు కేటాయించాలని దేవాదాయ శాఖ కోరింది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు సమకూర్చుకోవాల్సి ఉన్నందున రూ.167 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు కోరారు. హరితహారానికి ప్రభుత్వ ప్రాధాన్యత నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖకు రూ.800 కోట్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం తదితరాల నిమిత్తం బీసీ సంక్షేమ శాఖకు రూ.3,800 కోట్లు కోరుతూ ఆ శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని సంబంధిత మంత్రులకు అందజేశారు.