breaking news
telangana minister harish rao
-
ఆయన తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
నల్గొండ (సూర్యాపేట) : ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నైతికత ఉంటే చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని, లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ వద్ద నిర్మాణం అవుతున్న వంతెన పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నారని చెప్పారు. చట్టం అందరి దృష్టిలో ఒక్కటేనని, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చట్టం సీఎంకైనా అయినా, సామాన్య ప్రజలకైనా ఒక్కటేనన్నారు. -
50 యూనిట్లలోపైతే.. కరెంటు ఫ్రీ
తెలంగాణలో 50 యూనిట్లలోపు వినియోగించే దళితకుటుంబాలకు ఉచిత కరెంటు అందిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జిలు పెంచుతున్నట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనం ఆధునీకరణకు రూ. 10 కోట్లు కేటాయింస్తామన్నారు.